విశాఖపట్నంలో ఇది వరకే దుమారం రేగినటువంటి దేవాదాయ అసిస్టెంట్ కమీషనర్ శాంతి వివాదం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈమె అప్పట్లో అక్కడ DCగా ఉన్నటువంటి పుష్ప వర్ధన్ పై నేరుగా వెళ్లి ఇసుక జల్లారు. ఆమె అప్పట్లో   DC పై ఇసుక చల్లడం కాని , కింద పని చేసే ఉద్యోగులు నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కున్నారు. హుండీ లెక్కింపు విషయంలో కూడా పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి  పైన విచారణ చేపట్టి అన్ని నివేదికల్లో  కూడా ఆమె వైపు తప్పుంది అని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ నివేదికా దేవాదాయ కమీషన్ దగ్గరకు వెళ్ళిన తరువాత  అసిస్టెంట్ కమీషనర్ శాంతిని పిలిపించి వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్నాక, ఇవన్ని కూడా క్షమించ తగ్గ  తప్పులే  అని పూర్తి స్థాయిలో ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు చర్చనీయంసంగా  మారింది.  ఒక డిప్యూటీ కమీషనర్ మీద  అసిస్టెంట్ కమీషనర్ పదవిలో ఉన్న ఆమె  ఇసుక చల్లినా, ఆమె పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆయన పూర్తిగా తన పదవికే రాజీనామా చేసారు. అలాగే కింద స్థాయి ఉద్యోగులు నేరుగానే ఆమె చేస్తున్న పనులన్నింటిని కూడా మీడియా ముందే చెప్పారు. ఈ విషయం అంతా కూడా  ప్రతి ఒక్కరు బహిర్గతంగా టివిలలో చూసారు. అయితే మరి దేవాదాయ శాఖా మంత్రికి ఇవన్ని తప్పులుగా కనిపిచక పోవటం, చాలా విచిత్రం గా ఉందని అంటున్నారు.

Advertisements