వైసీపీలో నెంబర్ 2 నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. జగన్ కు, విజయసాయి రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. జగన్ జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు, అన్నీ తానై విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజు విజయసాయి రెడ్డి జగన్ తో తనకు ఉన్న రేలషన్ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. నాకు, మా అధ్యక్షుడు జగన మోహన్ రెడ్డి గారికి, ఎలాంటి విబేధాలు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. నేను చనిపోయేంత వరకు జగన్, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉంటానని, విజయసాయి రెడ్డి అన్నారు. జగన్ తో ఎలాంటి విబేధాలు లేవు, భవిష్యత్తులో కూడా రావు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య, సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు ఎక్కువ తలుస్తూ ఉండటంతో, ఇలా ఏమైనా అనుకుని, విజయసాయి రెడ్డి, ముందుగానే ఇలా ప్రకటించారా అనేది తెలియాలి.

సహజంగా ఇలాంటి పెద్ద నాయకులు, ఇలాంటి ప్రకటన చెయ్యరు. మరి విజయసాయి రెడ్డి ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు, అనేది చూడాలి. ఇక మరో పక్క, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినందుకు హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారందరికీ తాను అండగా ఉంటానని విజయసాయి రెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి సోషల్ మీడియా చూసుకుంటున్నానని, ఏది జరిగినా, తమ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. కావాలని అలా కోర్టుల పై వ్యాఖ్యలు చెయ్యలేదని, తెలుగుదేశం వారు రెచ్చగొట్టటంతో అలా చేసి ఉంటారని అన్నారు. ఇందులో కూడా, ఎంత మంది ఫేక్ ఎకౌంటులతో, తమ పై ఇలా కుట్ర పన్నారో, చూడాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఇక నిమ్మగడ్డ పై కూడా విజయసాయి రెడ్డి, విమర్శలు చేసారు. నిమ్మగడ్డ రాసిన లేఖ, తెలుగుదేశం వాళ్ళు పంపించిందే అని విజయసాయి రెడ్డి అన్నారు.

Advertisements