గత వారం విశాఖపట్నంలో, ఎల్జీ పాలిమర్స్ లో, గ్యాస్ లీక్ అవ్వటం, 12 మంది చనిపోవటం, ఊళ్ళకు ఊళ్లు రోడ్డుల మీద పరిగెత్తటం, స్పృహ తప్పి పడిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే, ఆ రోజే మధ్యానం, జగన్ మోహన్ రెడ్డి, విశాఖ పర్యటనకు బయలు దేరారు. అయితే ఈ సమయంలో, వచ్చిన ఒక వీడియో, అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఆ సమయంలో జగన్ మోహన్ రెడ్డి, అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇద్దరు అధికారులు కార్ ఎక్కారు. అయితే ఇదే సందర్భంలో ఆళ్ళ నాని , జగన్ తో మాట్లాడటం, తరువాత జగన్, విజయసాయి రెడ్డికి ఏదో చెప్పటంతో, విజయసాయి రెడ్డి కార్ దిగిపోయారు. తరువాత జగన్, ఆళ్ళ నాని, చీఫ్ సెక్రెటరి, మరొక అధికారి, హెలికాప్టర్ లో విశాఖపట్నం వెళ్ళిపోయారు. అయితే, విజయసాయి రెడ్డి కార్ దిగిపోవటం పై, సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యింది.

విజయసాయి రెడ్డిని అవమానించేలా ఉన్న వీడియో, అంత దగ్గర నుంచి తియ్యటమే కాకుండా, దాన్ని బయటకు వదలటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక ప్రతిపక్షాలు అయితే, జగన్, విజయసాయి రెడ్డిని కావాలనే దించేసారని, ఈ రోజు విశాఖ ఇలా అవ్వటానికి కారణం, విజయసాయి రెడ్డి మాత్రమే అని అభిప్రాయం, విశాఖ ప్రజల్లో ఉండటంతో, ఆ కోపం చల్లార్చటానికి, జగనే ఇలా చేసారని ప్రచారం సాగింది. అయితే, అప్పటి నుంచి, ఈ విషయం పై వివరణ రాలేదు. అయితే ఈ రోజు ఈ విషయం పై స్వయంగా విజయసాయి రెడ్డే మాట్లాడారు. నిన్న రాత్రి విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన ఏరియాలో నిన్న విజయసాయి రెడ్డి, ఒక భవనం డాబా పై, పడుకున్నారు.

ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు ఇలా చేసాం అని చెప్తూ, ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో జరుగుతున్న అన్ని విషయాల పై, ప్రెస్ కి చెప్పారు. ఈ సందర్భంలో, కార్ లో నుంచి, దిగిపోయిన సంఘటన పై, ప్రెస్ అడిగింది. దీని పై విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ, తనను ఎవరూ దిగిపోమని చెప్పలేదని, నేనే దిగిపోయానని చెప్పారు. ఆ రోజు హెలికాప్టర్ లో, ఒక్కరికి మాతమే ఖాళీ ఉందని, అందుకే తాను దిగిపోయి, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానిని వెళ్ళమని, చెప్పానని అన్నారు. హెలికాప్టర్ లో సీటు లేక వెళ్లలేదని, అంతే కాని తనను దింపేసారని, ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని, కావాలని ఇలా ప్రచారం చేసారని విజయసాయి రెడ్డి చెప్పారు.

Advertisements