హైందవ దేవాలయాలపై జరిగిన ఘటనలకు సంబంధించి, కొందరిని అరెస్ట్ చేసినట్టుచెప్పిన, రాష్ట్ర డీజీపీ రెండురోజుల వ్యవధిలోనే హిందూ మతంపై జరుగుతున్న ఘటనలను ఉటంకిస్తూ, కొన్నిపార్టీల ప్రమేయం ఉందనడం ఏపీ ప్రజలతో పాటు, తాముకూడా ఆశ్చర్యపోయా మని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒకపార్టీ ప్రతినిధిగా తాను పార్టీలప్రస్తావనచేస్తే, ఎవరూ పెద్దగా స్పందించరన్న రామయ్య, డీజీపీ స్థాయిలో ఉన్నవ్యక్తి, తనకు పదవి ఇచ్చినపార్టీ రుణంతీసుకోవడంకోసం ఈరకంగా దిగజారి వ్యాఖ్యలు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. డీజీపీ ఎవరి దర్యాప్తునుఆధారం చేసుకొని మీడియావారితో మాట్లాడాడో చెప్పాలన్న రామయ్య, హైందవమతంపై ఘటనలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సీఐడీ, లేదా సిట్ లలో ఏ దర్యాప్తుసంస్థ సమాచారంతో మాట్లాడారాలేక సజ్జల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన సమాచారంతో డీజీపీ మాట్లాడారా అని టీడీపీనేత నిగ్గదీశారు. సీఐడీ, సిట్ లనుంచి సమాచారం లేకుండా, ఎవరిని కాపాడటానికి డీజీపీ ఈ విధంగా తొందరపడి మాట్లాడారో చెప్పాలన్నారు. ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం, చట్టంప్రకారమే, విధులు నిర్వహిస్తున్నాడో లేక జగన్మోహన్ రెడ్డి సంతృప్తికోసం పనిచేస్తున్నాడో డీజీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వెనక ఎవరున్నారో, అతనితో చేయిచేయి కలిపి తిరుగుతున్న రాజకీయ నేతలెవరో డీజీపీకి తెలుసునా అని రామయ్య ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన మాటలు నేరపూరితమా...లేక సోషల్ మీడియా ప్రచారం చేయడం నేరమో సవాంగ్ స్పష్టం చేయాలన్నారు.

praveen 16012021 2

రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై ఘటనలు తానే చేసానని, విగ్రహాలను ధ్వంసం చేశానని, హిందూదేవతల విగ్రహలు మొత్తం ఫేక్ అని, అనేక మందిని క్రైస్తవమతంలోకి మార్చానని, తనకింద 3,642 మంది పాస్టర్లు పనిచేస్తున్నారని, 699 హిందూ గ్రామాలను, క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని చెప్పిన ప్రవీణ్ చక్రవర్తి మాటలను డీజీపీ ఎందుకు మీడియా ముఖంగా వెల్లడించలేదని రామయ్య నిగ్గదీశారు. ప్రవీణ్ చక్రవర్తి అనేవ్యక్తి మాటలు నిజమా కాదా...అతని లక్ష్యమేం టి? అతను క్రైస్తవ మత వ్యాప్తి కోసం అమెరికాలో ఎవరితో మాట్లాడాడు... అతన్ని, అతనిచర్యలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలెవరు అనేఅంశాలపై డీజీపీ ఎందుకు విచారణ జరపడం లేదన్నారు? తనకు తానుగా విగ్రహాలను ధ్వంసంచేశానని చెప్పిన ప్రవీణ్ చక్రవర్తి హైందవమతంపై జరుగుతున్న ఘటనలలో డీజీపీకి నేరస్తుడిలా కనిపించలేదా అని రామయ్య ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తనకు బాగా తెలుసుననిచెబుతూ, తానుసాగిస్తున్న దురాగతాలను తననోటితోనే చెప్పిన ప్రవీణ్ చక్రవర్తిని మీడియాముందు ప్రవేశపెట్టి, డీజీపీ ఎందుకు మాట్లాడ లేదన్నారు. అధికారపార్టీ వారితో ప్రవీణ్ కు పరిచయాలున్నా, వాటిని ఖాతరుచేయకుండా అతన్ని అరెస్ట్ చేశామని డీజీపీ ఎందుకు చెప్పలేదన్నారు? ప్రవీణ్ చక్రవర్తి 699 గ్రామాలను క్రైస్తవం లోకి మార్చానని చెబుతున్నా, హైందవ దేవుళ్ల విగ్రహాలను ధ్వం సం చేశానని చెబుతున్నా, అతని గురించి, ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు ఆలోచించడంలేదని రామయ్య మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారంచేసినవారి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన డీజీపీ, ఒకనోటోరియస్ పాస్టర్ విషయంలో మాత్రం ఎందుకు ఉపేక్షించారన్నారు.

 

Advertisements