మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్‌) లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అప్పులు, వడ్డీ రేట్లపై ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ‘మంత్రిమండలికి సీఎస్‌ సబార్డినేట్‌ మాత్రమే. ఆయన సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం యనమల ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నిర్వహణ ఆర్థికశాఖ బాధ్యత. బడ్జెట్‌ ఆమోదాన్ని బట్టి నిధులను కేటాయిస్తుంది. ప్రాధాన్యం ప్రకారం నిధుల విడుదల ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమం, పేదల సంక్షేమానికి అనుగుణంగా నిధులిస్తుంది. రాబడి, అప్పుల మధ్య సమతుల్యతతో నిధుల నిర్వహణ ముడిపడి ఉంటుంది’ అని వివరించారు.

game 27032019

రోజువారీ అవసరాలపై సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని, ప్రజా ప్రభుత్వంలో జరిపే సమీక్షలకు అధికారులు హాజరుకావడం నిత్యకృత్యమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వానికి, ఆపద్ధర్మ ప్రభుత్వానికి తేడా తెలియని వాళ్లు ఫిర్యాదులు చేయడం, ఈసీ దానిపై స్పందించడం ఏమిటని యనమల దుయ్యబట్టారు. ఆర్థిక నేరగాళ్లు ఎన్నికల సంఘాన్ని నడిపిస్తారా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో మోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ఇలాంటి వ్యక్తిని మరో ఐదేళ్లు భరించడానికి దేశం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను.. మోడీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌గా ఏమైనా మార్చారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి రాజ్యాంగపరంగా సర్వాధికారాలున్నా విధుల నిర్వహణలో విఫలమైందని మండిపడ్డారు.

game 27032019

రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో ఈసీ విఫలమైందని యనమల రామకృష్ణుడు ఆదివారం విమర్శించారు. ప్రధానైనా, సామాన్యుడైనా చట్టం ముందు సమానులేనని, ఎన్నికల కోడ్‌ ఒక్కటేనని స్పష్టంచేశారు. ‘ఇప్పుడు ఈసీ అమలు చేస్తోంది మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్టా? లేక మోదీ కోడ్‌ ఆఫ్‌ కాండక్టా? ప్రధాని హెలికాప్టర్‌ను సోదా చేసిన అధికారిని సస్పెండ్‌ చేసిన ఈసీ.. సీఎంల హెలికాప్టర్లలో సోదాలు చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంది? పీఎంకు ఓ రకంగా, సీఎంలకు మరోరకంగా రాజ్యాంగం రాశారా? ఈసీ నిబంధనలు హోదాకో రకంగా ఉంటాయా? ప్రధాని హెలికాప్టర్‌లో ఏం దొరికాయో ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదు? ప్రధాని హెలికాప్టర్‌ నుంచి నల్ల ట్రంకు పెట్టెతో పరుగెత్తిన వాళ్లు ఎవరు? ఆ పెట్టెలో ఏమున్నాయి? వాటిని ఎక్కడికి తరలించారు? వీడియో క్లిప్పింగులు రుజువులుగా ఉంటే.. ఈసీ తీసుకున్న చర్యలేంటి?’ అని నిలదీశారు. వీటికి ఈసీ జవాబివ్వాలన్నారు.

Advertisements