వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంత్రి కొడాలి నాని, ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఆయన నేపధ్యం ఎలా ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, అదీ బాధ్యత గల మంత్రిగా ఉన్న తరువాత, ఆయన భాష పై కంట్రోల్ ఉంచుకోవాలి. అయినా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి, చంద్రబాబు పై విరుచుకు పడుతూ ఉంటారు. అవి రాజకీయ విమర్శలు అయితే పరవాలేదు. కాని, అవి వ్యక్తిగత విమర్శలు. అది కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతను పట్టుకుని, ఇష్టం వచ్చినట్టు, మాట తూలుతూ ఉంటారు. ఒక్కో సందర్భంలో వైసీపీ క్యాడర్ కు కూడా వెగుటు పుట్టేలా ఉంటాయి ఆ మాటలు. అయితే, కొడాలి నాని, ఇలా ఇష్టం విచ్చినట్టు నోరు పారేసుకున్నా, తెలుగుదేశం నేతలు మాత్రం, పెద్దగా రియాక్ట్ అవ్వరు. అతని స్థాయి అదే అని వదిలేస్తారో, లేక జరుగుతున్న విషయాల నుంచి టాపిక్ డైవర్ట్ చెయ్యటానికి, కొడాలి నానిని, దించుతారనో కానీ, తెలుగుదేశం పార్టీ అసలు నానిని పట్టించుకోదు.

అయితే నిన్న విశాఖలో, గ్యాస్ బాధితులు, మీ కోటి వద్దు ఏమి వద్దు, ఇక్కడ నుంచి కంపెనీని తరలించండి అంటూ, ఆందోళన చేసిన నేపధ్యంలో, దాన్ని నుంచి డైవర్ట్ చేయ్యటానికో ఏమో కాని, కొడాలి నాని, ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అయితే, తెలుగుదేశం ఈ సారి తీవ్ర స్థాయిలో స్పందించింది. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్, కొడాలి నాని పై విరుచుకు పడ్డారు. కోడాని నాని చరిత్ర అంతా చెప్తూ, చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమటానికి కూడా స్థాయిలేని నువ్వా, చంద్రబాబుని విమర్శించేది అంటూ విరుచుకు పడ్డారు. వైఎస్ఆర్ పార్టీ సంస్కృతి, పద్దతి, కొడాలి నాని మాటలు చూస్తే అర్ధం అవుతుందని, వారి స్థాయి అంతే అని అన్నారు.

మంత్రి హోదాలో ఉన్నాననే సోయ కూడా లేకుండా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లడటం చూస్తే, అతని అహంకారం ఎలా ఉందొ అర్ధం అవుతుంది అన్నారు. ఏదైనా విషయం పై ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనుకుంటే, తాడేపల్లి నుంచి ఫోన్లు వస్తాయని, ఫోన్లు వస్తూనే, అచ్చోసిన ఆంబోతుల్లా వచ్చి, బూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెడతూ, కుక్కల్లా మొరిగి, ఇంటికి వెళ్లి పడుకుంటారని అన్నారు. లారీ క్లీనర్ గా ఉండే నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని, చంద్రబాబు అని గుర్తు చేసారు. పొట్ట కొస్తే అక్షరం ముక్క రాని సన్నాసి, నువ్వా చంద్రబాబు గారిని విమర్శించేది అని విరుచుకు పడ్డారు. నీ శాఖకు సంబంధించి వేరే మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటేనే, నీ బ్రతుకు ఏమిటో తెలుస్తుందని అన్నారు. మాట్లాడితే చంద్రబాబుకి వయసు అయిపొయింది అంటున్నారని, నీకు వయసు అయిపోదా అని ప్రశ్నించారు. మేం బూతులు మాట్లాడలేమా.? తిట్టలేమా.? ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు అంటూ హెచ్చరించారు.

Advertisements