ప్రభుత్వ పథకాల మంజూరుకు ఎవరైనా లంచం అడిగితే నేరుగా తనకే ఫోన్ చేయాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బహిరంగంగా నియోజకవర ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్ లు చూసి నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లిన యరపతినేని, ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. బుధవారం పిడుగురాళలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రన్న బీమా, నూతన పింఛన, రేషన్ కారులు, వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించేందుకు, గృహనిర్మాణ రుణాలు ఇప్పించేందుకు, ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు ఎవరైనా లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని యరపతినేని సూచించారు.

yerapataneni 28062018 2

లంచం అడిగిన వారి వివరాలు, ఫోన్ నంబర్ తనకు తెలియజేస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టిస్తానని ఆయన స్పష్టం చేశారు. తన సెల్ నంబర్ 97033 55999కు ప్రభుత్వ పథకాల అమలుకు లంచం అడిగేవారి వివరాలను మెసేజ్ ద్వారా కానీ, నేరుగా మాట్లాడైనా చెప్పవచ్చునన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజ్యమేలుతున్న దళారీ వ్యవస్థ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు నేరుగా పొందేందుకు అడ్డంకిగా మారిందని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమల్లోకి తెచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చేందుకు సీఎం ఆహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు.

yerapataneni 28062018 3

ఉన్నత లక్ష్యాలను దళారులు తమ స్వార్థం కోసం నీరు కారుస్తుంటే చూస్తూ ఊరుకోబోనని ఆయన స్పష్టంచేశారు. ఆంతిమంగా ప్రజలకు మేలు జరగటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజలు ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, అన్ని పధకాలను ఉచితంగానే పొందవచ్చున్నారు. లంచాలిస్తే పనీ తొందరగా ఆవుతుందన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు. ఒకటి, రెండు నెలల్లో గురజాల నియోజకవర్గంలో సంచార ప్రచార వాహనం ఏర్పాటు చేయనున్నట్లు యరపతినేని వెల్లడించారు. ఈ ప్రచార వాహనం ద్వారా ఆయా గ్రామాల్లో ఎవరైతే ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్నారో వారి వివరాలు వెల్లడిస్తామన్నారు. రైతు రుణమాఫీ దగ్గర నుంచి కార్పొరేషన్ రుణాల వరకు పేర్లతో సహా ప్రకటిస్తామన్నారు.

Advertisements