వైఎస్ జగన్, ఒకేసారి 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ జగన్ అటూ, ఇటూ పెట్టుకున్న వారి పై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా, ఇదే పాయింట్ చెప్పూర్. వైసీపీ అభ్యర్థుల ప్రకటన విధానంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నేరగాళ్లతో జగన్‌ అభ్యర్థుల ప్రకటన చేయించారని ఆరోపించారు. ఒక వైపు నందిగం సురేశ్‌, మరో వైపు ధర్మాన ప్రసాదరావు మధ్యలో ఏ1 నిందితుడు జగన్‌ ఉన్నాడని విమర్శించారు. నందిగం సురేశ్‌ రాజధాని విధ్వంసంలో నిందితుడిని తెలిపారు. ఇక కన్నెధార గ్రానైట్‌ తవ్వేసిన నిందితుడు ధర్మాన ప్రసాదరావు ఉన్నారని వెల్లడించారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ధర్మానపై అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. అలాగే విశాఖ భూస్కాంలో కూడా ప్రధాన నిందితుడు ధర్మాన అన్నారు. ఎన్నికల్లో సైబర్‌ నేరగాళ్ల అరాచకం పెరిగిందని సీఎం ధ్వజమెత్తారు.

jagan abhyardhi 19032019

సైబర్ నేరగాళ్లంతా వైసీపీలో చేరారని సీఎం చంద్రబాబు అన్నారు. నేరగాళ్ల కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ మారిందని తెలిపారు. మైండ్‌ గేమ్‌లోనే కాదు.. సైకో గేమ్‌లోనూ జగన్‌ దిట్ట అని మండిపడ్డారు. అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేసినట్లు స్పష్టంచేశారు. టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని పిలుపునిచ్చారు. దొంగ సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడినా.. కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న సానుకూలతను ఎవరూ తగ్గించలేరని పేర్కొన్నారు. కసి, పౌరుషంతో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసేందుకు ప్రజలు సిద్దమయ్యారని వెల్లడించారు. వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందన్నారు. దిక్కుతోచనిస్థితిలో వైసీపీ ఎంతటి అరాచకాలకైనా తెగపడుతుందని ధ్వజమెత్తారు.

jagan abhyardhi 19032019

దొంగ సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కుట్రలు పన్నినా తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఉన్న సానుకులతను ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని పథకాల లబ్ధిదారులు కసి, పౌరుషంతో ఉన్నారని, దీంతో వైకాపాకు ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. దిక్కు తోచని స్థితిలో ఎంతటి అరాచకాలకైనా వైకాపా సిద్ధమవుతోందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇక తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని ఆయన కోరారు.

Advertisements