తిరుపతి ఉప ఎన్నికల్లో, వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి పై, తెలుగుదేశం సోషల్ మీడియాలో, ఆయన్ను కించపరుస్తూ పోస్ట్ పెట్టారని, అందుకని చంద్రబాబు, లోకేష్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అంటూ, వైసీపీ ఎంపీ సురేష్ తో పాటు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు డీజీపీకి ఫిర్యాదు చేసారు. అయితే దీని పై సీరియస్ గా రియాక్ట్ అయ్యింద్ టిడిపి. చంద్రబాబుని ప్రచారంలో పాల్గునకుండా, ఇరికించే కుట్ర పన్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపాలనలో, దళితులకు రక్షణ లేదని వర్లరామయ్య గారి విషయంలో మరోసారి రుజువైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ అభిప్రాయపడ్డా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యు లు వర్లరామయ్యకు బెదిరింపుకాల్స్ వస్తే కనీస చర్యలు తీసుకోకుండా, తాత్సారంచేస్తున్న పోలీసుల వైఖరి మరో వైపు, దళితుల రాజధాని అమరావతిని భూస్థాపితం చేస్తున్న ముఖ్యమంత్రి వైఖరి మరోవైపుఉందన్నారు. దానితోపాటు, దళితులకు శిరోముండనాలు, డాక్టర్ సుధాకర్, అనితారాణిలకుజరిగిన అవమానాలపై స్పందించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుని మరోవైపు ఛూస్తున్నామన్నారు. వారంతా తగుదునమ్మా అంటూ చంద్రబాబునాయుడిపై, లోకేశ్ పై ఫిర్యాదు చేయడానికి డీజీపీ వద్దకు వెళ్లారన్నారు. జగన్మోహన్ రెడ్డికి గురుమూర్తి కాళ్లు నొక్కడం నిజమా అబద్ధమా చెప్పాలన్నారు. అలానే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కూడా ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న మాట వాస్తవమాకాదా అన్నారు. చంద్రబాబునాయుడి పై వైసీపీ నేతలు అట్రాసిటీ కేసు పెట్టాలనడం విచిత్రంగా ఉందన్నారు. వారంతా కేసుపెట్టాల్సింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిపైనే నని జవహర్ తేల్చిచెప్పారు. దళితుడితో కాళ్లు ఎలా నొక్కించుకుంటున్నారని ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిపైన, పెద్దిరెడ్డిపైనే కేసులు పెట్టాలన్నారు.

చంద్రబాబునాయుడి వ్వవహారంపై అనేకసార్లుకేసులు పెట్టి అభాసుపాలయ్యారన్నారు. దళితనాయకులంతా జగన్మోహన్ రెడ్డి పాలనలో మాట్లాడలేని స్థితిలో ఉన్నారన్నారు. మేరుగ నాగార్జున, సురేశ్ ఎస్సీలోకాదో తెలియడంలేదన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం మొదలుకొని చిత్తూరు వరకు దళితులపై దా-డు-లు, మహిళలపై అ-త్యా-చా-రా-లు జరుగుతున్నా, శిరోముండనాలు, హత్యలు జరుగుతున్నా వారు ఏనాడూకనీసం స్పందించలేదన్నారు. దళితులపైనే అట్రాసిటీకేసులు పెట్టిన దౌర్భాగ్యపు పరిపాలనలో వైసీపీదళితనేతలు ఉన్నారన్నారు. వారంతా తక్షణమే డీజీపీని కలిసి జగన్మోహన్ రెడ్డిపై పెట్టాల్సిన కేసుని పొరపాటున చంద్రబాబుపై పెట్టినట్లు తప్పుఒప్పుకోవాలన్నారు. దళితుల ముసుగులో నయా జమీందారులుగా, నయా వలసవాదులుగా, నయా ధనికవర్గప్రతినిధులుగా నాగార్జున, సురేశ్ వంటివారు చెలామణీ అవుతున్నారని జవహర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణగా ఉండాల్సిన చట్టాలన్నీ నిర్వీర్యమై పోయాయని, ఎస్సీ సబ్ ప్లాన్ కూడా లేకుండా పోయిందన్నారు. ఆఖరికి చర్మకారులకు, డప్పులుకొట్టేవారికి ఇచ్చిన స్థలాలు కూడా కబ్జాకు గురవుతుంటే, ఏనాడూవారు మాట్లాడింది లేదన్నారు. ఇంతజరుగుతున్నా నోరెత్తని వారు తగుదునమ్మా అంటూ డీజీపీ వద్దకెళ్లి, చంద్రబా బుపై ఫిర్యాదుచేస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. శిరో ముండనం కేసులో కవలకృష్ణమూర్తి ఏమయ్యాడో, దళిత మహిళలపై అత్యాచారాలు చేసినవారుఏమయ్యా రో చెప్పాలన్నారు. దళితులుగా బయటకొచ్చిన వైసీపీనేతలు, దళితరాజధాని అమరావతిని చంపుతున్నందుకు జగన్మోహన్ రెడ్డిపైనే కేసుపెట్టాలని జవహర్ తేల్చిచెప్పారు.

Advertisements