జగన్ చేసిన తప్పుతో, వైసీపీ ఫ్యాన్ గుర్తు కనుమరుగు అవుతుందా ? అవును అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే జగన్ చేసిన పొరపాటు పై, ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా ఇచ్చింది. విషయం ఏమిటంటే, జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ ను తొలగించాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ కోరుతున్నారు. పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లిన శివకుమార్ ముందుగా ఫ్యాన్ గుర్తును ఫ్రీజ్ చేయమని కోరుతానంటున్నారు. వైసీపీ పార్టీ మళ్లీ తిరిగి తనకు వచ్చేదాకా పోరాటం చేస్తానని, ఎన్నికల సంఘంలో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు.

gannvaarma 22022019

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్ఆర్ కాంగ్రెస్) పేరుతో శివకుమార్ అనే లాయర్ స్థాపించి రిజిస్టర్ చేసుకోగా జగన్ మోహన్ రెడ్డి అతని దగ్గర నుండి పార్టీని తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా జగన్, వ్యవస్థాపకునిగా శివకుమార్ ఉన్నారు. శివకుమార్ తెలంగాణ జనరల్ సెక్రటరీగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు పార్టీలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైసీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన జగన్ శివకుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో అప్పుడే జగన్ పై ఘాటుగా స్పందించిన శివకుమార్ బహిష్కరణ ఎత్తివేయాలని లేనిపక్షంలో పార్టీ నుండి జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీచేశారు. దీంతోపాటు న్యాయపోరాటంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా ఇప్పుడు జగన్ కు నోటీసులు జారీ చేసింది.

gannvaarma 22022019

వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్‌పై మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమాని శివకుమార్.. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియా శీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతివ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వైఎస్ జగన్.. శివకుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్.. ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

Advertisements