విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు, అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి తరలివచ్చారు. మరోవైపు.. ఇప్పటివరకూ పోలీసులు ఈ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తును మోహరించారు. ఇరు పార్టీల నేతలను అదుపు చేస్తున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం చంద్రబాబు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టి, తన పర్యటన కోసం, బయటకు రాగానే, వైసీపీ మూకలు ఎయిర్ పోర్ట్ లో రెచ్చి పోయాయి. చంద్రబాబు పై, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరెందుకు ప్రయత్నం చెయ్యగా, అవి వచ్చి పోలీసుల మీద పడ్డాయి. పోలీసులు మాత్రం వైసీపీ శ్రేణులు ఎంత వీరంగం సృస్తిస్తున్నా, చూసి చూడనట్టు వదిలేసారు. చంద్రబాబు పర్యటనకు స్వాగతం పలకటానికి టిడిపి కార్యకర్తలు వస్తారని తెలిసినా, వైసీపీ కార్యకర్తలను ఎలా పంపించారు అనేదాని పై, టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

cbn 270220202

వైసీపీ శ్రేణులు, ఎయిర్ పోర్ట్ లో చేస్తున్న వీరంగం కవర్ చేస్తున్న మీడియా ఛానెల్స్ పై కూడా వైసీపీ మూకలు దాడి చేసారు. మరో పక్క, చంద్రబాబుకి స్వాగతం పలకటానికి వచ్చిన, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వాహనాన్ని కూడా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో టిడిపి శ్రేణులు, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు వాహనం ముందు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అలాగే ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కారు అద్దాలు కూడా పగలకొట్టారు. ఇక ఎయిర్ పోర్టు దగ్గర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. తమ అధినేత వస్తుంటే, మేము స్వాగతం పలకటం కూడా తప్పా అంటూ, తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.

cbn 27022020 31

వైకాపా నేతల లెక్క తేలుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనకు బయల్దేరే ముందు పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ చేశారు. ఉదయం పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ చేశారు. వైకాపా లెక్కలను ఉత్తరాంధ్ర పర్యటనలో తేల్చుతానని వ్యాఖ్యానించారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైకాపాకు... తెదేపాను ప్రశ్నించే నైతిక అర్హత లేదన్నారు. పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వకం సరికాదని చెప్పారు. తన పర్యటనకు ఆంక్షలు పెట్టడం కాదని.. రోడ్లు తవ్వుతున్న వారి సంగతి చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రోడ్లు తవ్వినా, ప్రొక్లెయినర్లు అడ్డుపెట్టినా పర్యటన ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతోందని ఆరోపించారు.

Advertisements