ఆర్కే బీచ్‌‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌‌ను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉంది, రేపు CII సమ్మిట్ ఉంది, పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్పారు.

"రెండేళ్లు.. రెండే రెండేళ్లలో సీఎం అవుతా.. మీ అంతు చూస్తా.. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా ఎవర్నీ మరిచిపోన"ని పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన పక్కనే ఉన్న మరో వైసీపీ నేత "గుర్తు పెట్టుకుని మరీ మిమ్మల్ని పట్టుకుంటామన్నట్లు"గా వార్నింగ్ ఇచ్చారు.!

ఇంకో సందర్భంలో ఒక పోలీస్ జగన్ ను తాకగా, "యాయ్... నువ్వు కాబోయే ముఖ్యమంత్రిని పట్టుకున్తున్నావ్" అని అనటంతో, పోలీసులు అవాక్కయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళు, జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని గుసగుసలాడారు 

Advertisements