ప్రైవేటు ఆపరేటర్లు నష్టాల్లో కూరుకుపోయి, సంక్షోభ దిశలో పయనిస్తుంటే.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మాత్రం హైఎండ్‌ బస్సుల విభాగంలో మాత్రం లాభాల్లోనే పయనిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సుల విషయంలో ప్రైవేటు ఆపరేటర్లతో పోల్చుకుంటే ఆర్టీసీ ఆలస్యంగా ప్రారంభించింది. అత్యాధునిక బస్సుల వేటలో భాగంగా మరిన్ని ఓల్వో, ఇసూజూ బస్సులతో పాటు ప్రైవేటు చేతుల్లో లేని మెర్సిడెజ్‌ బెంజ్‌ బస్సులను కూడా ఆర్టీసీ కొనుగోలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అయితే ఏకంగా స్వీడన్ దేశం నుంచి స్కానియా బస్సులు కొనుగోలు చేసి "అమరావతి పేరుతో" నడుపుతోంది.

తాజాగా దేశీయంగా... పూనే కేంద్రంగా తయారతున్న ’కరోనా ’ కంపెనీకి చెందిన బస్సులను ఆర్టీసీ కొనుగోలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం 20 బస్సులు విజయవాడకు చేరాయి. విద్యాధరపురం డిపో గ్యారేజీలో వీటిని ఉంచి రిజిస్ర్టేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. కృష్ణా రీజియన్‌కు 11 బస్సులు కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన వాటిని ఇతర జిల్లాలకు కేటాయిస్తారు. దశల వారీగా మరిన్ని బస్సులు నగరానికి రానున్నాయి.

ఇవి ‘కరోనా’బస్సు ప్రత్యేకతలు:

  • ‘కరోనా’ బస్సులను ‘గరుడ’ శ్రేణిలో నడపనున్నారు
  • ఈ బస్సుల ధర, రూ.70 లక్షల లోపే ధర ఉంది
  • విశాలమైన సీటింగ్‌
  • అత్యాధునిక ఏసితో, బస్సు ఉష్ణోగ్రతకు అనుగుణంగా కూలింగ్‌ అవుతుంది
  • బస్సు మధ్యలో అండర్‌ ఎమర్జెన్సీ డోర్‌. ఇది పూర్తిగా అగ్నినిరోధక గుణాన్ని కలిగి ఉంటుంది.

ఈ కంపెనీ బస్సులు అత్యంత దుర్భేద్యంగా ఉంటాయి కాబట్టి.. వీటికి దేశవ్యాప్తంగా ఉన్న రోడ్డు రవాణా సంస్థలు పెద్దఎత్తున వీటిని కొనుగోలు చేశాయి. 2005 సంవత్సరంలో విజయవంతంగా ట్రయల్‌ పూర్తయిన తర్వాత 2006 నుంచి మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. 2007లో కేఆర్‌సీటీ స్లీపర్‌ కోచలుగా ఈ కంపెనీ బస్సులను ప్రవేశపెట్టింది. 2009లో కర్నాటక స్టేట్‌ రోడ్డు ట్రాన్సపోర్టు కార్పొరేషన (కేఎస్‌ఆర్‌టీసీ) స్లీపర్‌ కోచలుగా ఆర్డర్‌ ఇచ్చింది. తర్వాత బెంగళూరులో బీఆర్‌టీఎస్‌ బస్సులుగా కూడా ఈ కంపెనీ బస్సులనే ఉపయోగించారు. చండీఘడ్‌ ట్రాన్సపోర్ట్‌ సంస్థ కూడా ఈ బస్సులను కొనుగోలు చేసింది.

Advertisements