దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై ప్రసంగించారు. అద్భుత ప్రగతికి ఆధునిక సాంకేతికతను తాము సోపానంగా మలుచుకున్నామని చెప్పారు. తానుకేవలం టెక్నాలజీలో తాను మేనేజర్ మాత్రమేనని, ప్రొఫెషనల్‌ని కానని చెబుతూనే ఒక ప్రొఫెషనల్ కంటే చక్కగా వివరించిన తీరు దావోస్ లో సదస్యులను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో ముఖ్యాంశాలిలా ఉన్నాయి:

‘ఇదో అద్భుతమైన ప్రదేశం. ప్రపంచ దిగ్గజాలంతా ఇక్కడ ఉన్నారు. ప్రపంచ దిగ్గజాలంతా ఇక్కడ ఉన్నారు. అందరం ఒకే చోట కలుసుకునేందుకు వీలయ్యింది. ‘నేను ప్రొఫెషనల్ ను కాను నేను మేనేజర్‌నే’. టెక్నాలజీ ఈ సమాజానికి , ముఖ్యంగా సామాన్యుడికి ఎలా ఉపయోగించాలా అనేదే నా తపన. ముప్ఫయ్ ఐదేళ్లనాడే టెక్నాలజీ ఉపయోగించాను. 1984-85..ఆ సమయంలో కంప్యూటర్లు ఉపయోగించాను. పార్టీ నిర్మాణంలో వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలని, జవాబుదారీతనంకోసం కంప్యూటర్లు ఉపయోగించాం. ఆరోజుల్లో కంపెనీలు పరిమితంగానే ఉండేవి. పెద్ద పెద్ద మిషన్లుండేవి. ఈ కంప్యూటర్ల ఉంచడానికి ప్రజలకు ఏసీలు కూడా లేని సమయం. ఈరోజు పరిస్థితి గణనీయంగా, సంపూర్ణంగా మారిపోయింది. ఇంటరనెట్ రాకతో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజిగా మారింది. ‘ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్’ తో ఇవాళ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నడుస్తున్నది. బయోమెట్రిక్స్,సెన్సర్స్ , డివైసెస్, సీసీ కెమేరాలు, డ్రోన్స్, రొబొటిక్స్..అనూహ్య సాంకేతిక ఆవిష్కారాలు వచ్చాయి.

అయితే ఇవన్నీ రాకముందే మా రాష్ట్రంలో నేను అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాను. ఐటీ కంపెనీలను ఆకర్షించటానికి ప్రపంచమంతా తిరిది ప్రత్యేక కృషిచేశాను. హైదరాబాద్ ఒక నాలెడ్జి హబ్ గా ఏర్పడటంలో ఆనాటి కృషిని తక్కువ అంచనావేయవద్దు. నేను సాధ్యమైనంత వరకు అన్ని టెక్నాలజీలు ఉపయోగిస్తాను. రాజకీయాల్లో కొన్ని నాటకీయ సంఘటనలు జరుగుతుంటాయి. పాలిటిక్స్ లో అనూహ్యంగా నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నట్లే ఒకోసారి టెక్నాలజీలో కూడా చోటుచేసుకుంటాయి. భారత్ లో మా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు నల్లధనాన్ని అరికట్టడడానికి హఠాత్తుగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1000,రూ.500 నోట్లు రద్దు చేశారు. 86% లావాదేవీలు కరెన్సీ తోనే జరిగే మా దగ్గగర డీమోనిటైజేషన్ ప్రభావం పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్నాం. మొబైల్ లావాదేవీలవైపు మళ్లాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా భారత్ ఒక సానుకూలాంశం ఉంది. అదే ఆధార్.

తొంభై శాతం మంది ప్రజలక ఆధార్ కార్డులున్నాయి. గత గత రెండేళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో నేను ఈ-పోస్ ఉపయోగిస్తున్నాను. ఫింగర్ ప్రింట్స్ , లేదా ఐరిస్. ఇదే అథెంటికేషన్. ఇదే ఆధార్ కార్డును మేం డీమోనిటైజేషన్ సంక్షోభ కాలోం వినూత్నంగా ఉపయోగించుకున్నాం. వెంటనే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సంప్రదించాం. వాళ్లొక యాప్ తయారు చేశారు. దాంతో అన్ని బ్యాంకులు ఒకే ఛత్రం కిందికి వచ్చాయి. ఇప్పుడు మా రాష్ట్రంలో స్మార్టుఫోన్లు కేవలం 30% మంది మాత్రమే వాడుతున్నారు. మరి డిజిటల్ లావాదేవీలు ఎలా జరుగుతాయి? అందుకే ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. ఫింగర్ ప్రింట్, ఆధార్ కార్డు నెంబర్ తెలిస్తే ఒక ఖాతాదారు తాను కొన్న వస్తువులకు చేతిలో డబ్బులేకున్నా సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేశాం. మరో వైపు వ్యాపారులు స్మార్టు ఫోను, ఒక బయోమెట్రిక్ పరికరంతో (పరికరం ఖరీదు రూ.2,000) ఉంటే చాలు. అక్కడే ఒక మైక్రో ఏటీఎం ఉన్నట్లే. ఆటోమేటిక్ గా ఇది మైక్రో ఏటీఎంలా పనిచేసింది. అలా తేలిగ్గా లావాదేవీలు నిర్వహించేలా చేశాం. ఇక్కడ 100% విశ్వసనీయత కలిగిన టెక్నాలజీ ఇది.

నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఒక దశాబ్దం ముఖ్యమంత్రిగా, ఒక దశాబ్దం పాటు ప్రతిపక్ష నాయకుడగా పనిచేశా. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. నేనిప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాను. కొత్త రాష్ట్రమయినా అది అద్భుతమైన రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రాన్ని ఒక ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది నా తపన. నేనేం చేస్తున్నానో మీకో ఐడియా ఇవ్వదల్చాను. ఉదాహరణకు సీఎం డ్యాష్ బోర్డు. ఇది చూసి మీరు చెప్పండి. ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో చెప్పండి. సిద్ధంగా ఉన్నాను. గత రెండేళ్లుగా మేం ప్రజాపంపిణీ వ్యవస్థలో, పెన్షన్ల పంపిణీకి ఈ పోస్ ఉపయోగించాం. ఇది సీఎం డ్యాష్ బోర్డు. మా రాష్ట్రంలో 4.47% జనాభా ఉంది. డ్యాష్ బోర్డులో ఈ ఫీచర్ చూడండి. ఇవి వీధిలైట్లు. రెండేళ్లక్రితం హుద్ హుద్ తుఫాను వచ్చింది. విశాఖ నగరంలో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. వారం రోజులలోనే సాధారణ పరిస్థితి తెచ్చాం. . అన్ని వీధి దీపాలు సర్వనాశనమయ్యాయి. నాకు అప్పుడో ఐడియా వచ్చింది. అన్ని వీధి దీపాలను ఎల్ ఈడీ బల్బులనే పెట్టాలని నిర్ణయించాం. అలా అన్నీ ఎల్ ఇడి బల్బులు పెట్టి 40% విద్యుత్తు ఆదా చేశాం.
అన్ని నగరాల్లో సెన్సర్లున్నాయి. 5.56 మిలియన్ బల్బులున్నాయి. ఇవన్నీ సెన్సార్ గేజ్డ్ బల్బులు.

బల్బులు పెట్టండి. మీరు సేవా ప్రమాణాలు పాటించాలని అడిగాను. సెన్సర్ గేజ్డ్ బల్బులు కాబట్టి మీ ఇంటిలో ఒక బల్బు వెలగకున్నా ఇక్కడ కనపడుతుంది. నా కంట్రోల్ రూమ్ నుంచి నేను పర్యవేక్షించగలను. మెకానిజం సరిచేయగలను. ఇది నేను చేశాను. గతంలో ఇండియాలో పగలే లైట్లు వెలిగేవి. కొన్నివెలిగి కావు. ఇప్పుడీ కష్టాలు లేవు. నేను కావాలనే వీధి దీపాలను గమనిస్తుంటాను. సీఎం ఆఫీసులో డ్యాష్ బోర్డు పెట్టాం. ఇది రియల్ టైమ్ మేనేజిమెంట్ వర్షపాతం ను చూస్తాను. వర్షపాతం లోటు 28 %గా కనపడుతోంది. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైందో, ఎక్కడ ఎంత భూగర్భ జలాలున్నాయో, ఎంత చేరాయో తెలుసుకోగలను.

11.64 మీటర్ల వర్షపాతం రియల్ టైం.
సెన్సర్లు, పరికరాల ద్వారా నేను ఉపరితల జలాల పరిస్థితి, భూగర్భ జలాల పరిస్థితినీ అంచనా వేస్తాను. బయోమెట్రిక్ అథెంటికేషన్ తో మా విద్యార్ధుల హాజరు శాతం చూస్తున్నాం. ఏ విద్యార్ధి హాజరయ్యాడు, ఏ ఉద్యోగి హాజరయ్యాడు, ఎవరు హారు కాలేదో నేను తెలుసుకోగలుగుతున్నాను. అలా మానిటర్ చేసుకుంటాను. ప్రజలకోసం పైబర్ గ్రిడ్ అనే పెద్ద ప్రయోగం చేస్తున్నాం. భూగర్భ కేబుళ్లు వేస్తే రూ 5 వేల కోట్లవుతుంది. మా దగ్గర డబ్బు లేదు. వ్యయం తగ్గించాలి. ఇందుకోసం ఇప్పుడు ఉన్న కరెంటు స్తంభాలను ఎందుకు ఉపయోగించకూడదన్న వినూత్న ఆలోచన వచ్చింది. అన్ని ఇళ్లకు విద్యుత్తు ఇచ్చినట్లే కరెంటు స్తంభం ఆధారంగా ఫైబర్ వైరు వేశాం. సబ్ స్టేషన్లు కనెక్టు చేశాం. స్మార్టు మీటర్లిచ్చాం. 300 కోట్లతో చేశాం. పది లక్షల మందికి సెట్ టాప్ బాక్సులు ఇచ్చాం. కనెక్ట్ చేశాం. అన్ని ఛానెల్స్ టీవీలు చూడవచ్చు. విడియో, టెలిఫోన్..కేవలం 249 రూపాయలకు 15mbps కనెక్షన్లిచ్చాం.నెలకు ఈ మూడు ప్రయోజనాలు సమకూరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కనక్షన్. వారి ఇంట్లో విద్య, ఆరోగ్యం ఇంకా అనేక ప్రభుత్వ పథకాలు ఎలా అమలు జరుగుతున్నయో విడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడగలను. మా ప్రభుత్వం పరిపాలనకు సంబంధిం వివరాలన్నింటినీ ఆన్ లైన్ లో ఉంచింది. అన్ని సింక్రజైన్ చేస్తున్నాం. వ్యవసాయం, సివిల్ సప్లయిస్, కమర్షియల్ టాక్సెస్,ఇంకా అనేక డిపార్డుమెంట్లను చూడండి. మేం ‘ఈ- ప్రోగ్రెస్’ ని అభివృద్ధి చేశాం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేం నెంబర్ వన్. గత ఏడాది ఏపీ గ్రోత్ రేట్ 10.99%. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటిదాకా వృద్ధిరేటు 12.23%, -28 % వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యింది.

మా ప్రభుత్వంలో అన్నీ వివరాలు ఆన్ లైన్ లో ఉంచాం. అల్టిమేట్ గా రియల్‌ టైమ్ గవర్నెన్స్. నేనూ టెక్నాలజీ ద్వారా సమస్యలకు పరిష్కారాలు వెదుకుతున్నాను అందులో ఒకటి సాయిల్ టెస్టింగ్. సాయిల్ టెస్టింగ్ కు ఇప్పటిదాకా ఒక సమగ్రపరికరం లేదు. ఇంటర్ నెట్ ఆధారంగా ఎక్కడ సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉన్నాయో, ఎక్కడ లేవో తెలిపే పరికరాలు రావాలి. మేం అభివృద్ధి చేసిందాంట్లో చెప్పుకోదగింది కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను చెప్పుకోవాలి. మా రాష్ట్రంలో నిర్మిస్తున్న బహుళార్ధ సాధక నీటి పథకం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు. ఈరోజు 2017 జనవరి 19. ఇప్పుడు ఈ టైమ్ లో ఎంత పని అయ్యిందో నేను ఇక్కడ ఉండి చూడగలను. ఇదే రియల్ టైమ్.

కొన్నిసార్లు నేనే స్వయంగా వెళతాను. కొన్ని పర్యాయాలు వర్చువల్ గా ఇలా చూసి పర్యవేక్షిస్తాను. టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో మీరు చూశారు. నా ఐడియాలు చెప్పాను. మీతో భవిష్యత్తుకు సరిపోయేవి పంచుకుంటా. నేను ఒక నమూనాగా తీర్చిదిద్దుతాను.
నేను అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తే దావోస్ లో ఉండి ఫైళ్లమీద సంతకాలు చేయవచ్చు. అక్కడ జరిగే వాటిపై నా కామెంట్స్ పంపవచ్చు. నాకు మీ సహకారం కావాలి ఐడియాలు ఇవ్వండి మేం ఒక ఆదర్శ రాజ్యంగా, నమూనాగా తీర్చిదిద్దుతాం.
భారత్ లో జనాభా యువజనాభా మా బలం. టెక్నాలజీలో మేం ఎంతో బలంగా ఉన్నాం. ఈ విధానాన్ని ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో సూచనలివ్వండి. అమలుచేస్తాం. నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. నేను సాధించే ఐడియాలను మీముందు ఉంచాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఇంకా ఎలా ముందుకెళ్లాలో చెప్పండి. ఇంతకంటే మెరుగైన పరిష్కారాలు ఎవరైనా చూపిస్తే సంతోషంగా స్వాగతిస్తాను’.

Advertisements