సిఐఐ భాగస్వామ్య సదస్సులో వచ్చిన ప్రతి MoU వాస్తవరూపం దాల్చటానికి, మాష్టర్ ప్లాన్ వేసారు చంద్రబాబు. సామాన్యంగా, ఎదో MoU చేసుకున్నమా, చెప్పుకున్నామా అని కాకుండా, ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి, ఇలా సమీక్ష చేయటం, చంద్రబాబు పెట్టుబడుల కోసం ఎంత పట్టుదలగా పని చేస్తున్నారో అర్ధం అవుతుంది.

విషయంలోకి వస్తే, వివిధ రంగాల ద్వారా 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో జరిగిన అవగాహనా ఒప్పందాలు కార్యరూపంలోకి తీసుకురావాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో జరిగిన 644 ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా ఆయా ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించి, నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

వెలగపూడి సచివాలయంలో మంగళవారం రాత్రి విశాఖ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాల పై సిఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒప్పందానికి ఒక ఎస్కార్డ్ అధికారిని నియమించి, వెంటపడి పని చేయించుకోవాలని ఆదేశించారు. కుదిరిన ఓప్పందాలకు, వస్తున్న పెట్టుబడులకు, సాధించే వృద్ధి రేటుకు మధ్య సారూప్యత ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సదస్సులు, అక్కడ కుదిరిన ఒప్పందాలు, వాటిల్లో వాస్తవ రూపం దాల్చిన పెట్టబడులను పరిశీలించి, వాటికంటే ఎక్కువ సంఖ్యలో రాష్ట్రంలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవా లన్నారు.

ఇందుకు అవసరమైన భూ కేటాయింపులు, ఇతర అనుమతులు, పారదర్సకంగా, వేగంగా ఉండాలన్నారు. దావోస్ తరహాలో అమరావతి భాగస్వామ్య సదస్సుల నిర్వహణకు శాశ్వత వేదికను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా పారిశ్రామిక రంగానికి సరైన రోడ్ మ్యాప్ సిద్ధంచేయాలన్నారు.

Advertisements