జాతీయ మహిళా పార్లమెంటరీ (నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ) సదస్సు, ఫిబ్రవరి, 10, 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అయిన ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో జరగున్నది. మ‌హిళా సాధికారిత, జాతీయ నిర్మాణ రంగంలో మహిళల ప్రాధాన్యత, అన్ని రంగాలలో మహిళ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్రోత్సాహంతో గోదావరి, కృష్ణా నదుల సంగమం ప్రాంతం అయిన పవిత్ర సంగమం వేదికగా ఈ సదస్సు జరగనున్నది.

ఈ సదస్సుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, లైబీరియన్ ప్రెసిడెంట్, బౌద్దమత గురువు దలైలామా, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్, లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్, శ్రీ శ్రీ రవి శంకర్, మనిషా కొయిరాల, తదితర దేశ, విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1400 మంది మహిళా శాసన, శాసనమండలి సభ్యులు, 93 మంది పార్లమెంటు సభ్యులు, వివిధ రంగాలకు చెందిన 300 మంది మహిళలు హాజరయ్యేవిధంగా ఆహ్వనాలు పంపనున్న‌ట్లు తెలిపారు. సుమారు 12వేల మంది జాతీయ, అంతర్జాతీయ మహిళా పార్లమెంటేరియన్లు, వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన మహిళా మణులు హాజరు కానున్నారని తెలిపారు.

మహారాష్ట్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరీంగ్ (యంఐటి) పూనేకు చెందిన సంస్థ సంయుక్త సహకారంతో సదస్సును నిర్వహిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

అమరావతిలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగే మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు (నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ) హాజరయ్యే విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు విచ్చేసే విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు తమ గుర్తింపు పత్రాలు చూపించి ఉచిత బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పారు.

ఇక్కడ 3 రోజుల పాటు వివిధ గ్రూప్ డిస్కెషన్స్ జరుగుతాయని, ఇందులో భారతదేశంలో 35 వేల కాలేజీలకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్లోని 100 కాలేజీలకు చెందిన విద్యారులు హాజరవుతున్నారన్నారు. మహిళలందరిని ఒక చోట చేర్చడం ఒక మంచి పరిణామమని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని చేయడం అభినందనీయమన్నారు.

Advertisements