ప్రధానమంత్రి లక్కీ లక్కీగ్రాహక్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించే లక్కీ డ్రాలో కృష్ణాజిల్లా వత్సవాయి మండలం తళ్ళురు గ్రామానికి చెందిన వృద్దాప్య పెన్షన్ దారు కంచర్ల పుల్లమ్మ నగదు రహిత లావాదేవీలు నిర్వహించినందుకు తన బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆధికారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నగదు రహిత లావాదేవీలు జిల్లాలో పెరిగే విధంగా ప్రజలందరూ స్వచ్ఛంధంగా జరిపేందుకు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. ఇప్పటివరకు జిల్లాకు సంబంధించి కోటి 60 లక్షలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన లబ్దిదారులకు లక్కీ డ్రాలో నగదు గెలుపోందారన్నారు. జిల్లాలో లక్ష రూపాయలు నగదు బహుమతి పొందిన వారిలో పుల్లమ్మ రెండవ వారని కలెక్టర్ తెలిపారు.

పౌరసరఫరాల కమీషనర్ వి.రాజశేఖర్ డిజిటల్ లావాదేవీల పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బాబు ఎ ను జిల్లా వాసి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుపొందడం పై ప్రత్యేకంగా ప్రసంశించారు. డిజిటల్ లావాదేవీలలో కృష్ణాజిల్లా దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని, ఆధికారులు కూడా తమ వంతుగా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని పౌరసరఫరాల కమీషనర్ వి.రాజశేఖర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు.

Advertisements