జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయటం ఇదేం కొత్త కాదు. ఇదేమీ మొదటిసారి కూడా కాదు. ఇప్పటికి చాలా సార్లు జగన్ ఆస్తుల్ని ఈడీ, తాజాగా ఆస్తులు జప్తు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన జారీ చేసింది.

మనీలాండరింగ్‌ చట్టం కింద, సరస్వతి పవర్‌కి చెందిన 903 ఎకరాల, రూ.318 కోట్ల విలువైన భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని.. తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో భూములను స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ల వారీగా ఈడీ ఇవాళ పత్రికా ప్రకటన ద్వారా స్వాధీనాన్ని ప్రకటించింది.

గతానికి.. ఇప్పటికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. అడ్జుడికేటింగ్‌ అథారిటీ ఆమోదంతో ఈడీ స్వాధీనం చేసుకుంది.

జగన్ తన సరస్వతి సిమెంట్స్‌ కోసం రైతుల నుంచి భూములు లాక్కొని తిరిగి వారి పైనే మారణాయుధాలతో దాడి చేసి పంటలను నాశనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో, జగన్ లోటస్ పాండ్ ఇంటి ముందు, ఈ 903 ఎకరాలకు చెందిన రైతులు ఆందోళన కూడా చేసారు. ఇప్పుడు ఈ 903 ఎకరాలు ఈడీ చేతికి వెళ్ళటంతో, అవి రైతులకి ఇస్తారా, లేక అలాగే కోర్ట్ తేల్చే వరకు, వాళ్ళ ఆధీనంలో ఉంటాయా అనేది ఆశక్తిగా మారింది.

Advertisements