ఆంధ్రప్రదేశ్ పోలీస్, టెక్నాలజీ బాట పడుతుంది... స్మార్ట్‌ పోలీస్‌స్టేషన్ల తో, ప్రజలకి మరిన్ని సేవలు అందించేదుకు సమాయత్తం అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, డీజీపీ సాంబశివరావు, పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. చంద్రబాబు చెప్పిన "విజిబుల్‌ పోలీసింగ్‌ అండ్‌ ఇన్‌ విజిబుల్‌ పోలీస్‌" నినాదానికి అనుగుణంగా సాంబశివరావు గారు పని చేసారు. ఇందులో మొదటి అడుగులో భాగంగా, గుంటూరులోని నగరంపాలెం, పాత గుంటూరు ఆదర్శ పోలీసుస్టేషన్లను ఆదర్శ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ వీటిని ప్రారంభించనున్నారు.

ఇవి ఎలా పని చేస్తాయి ?
ఈ పోలీస్ స్టేషన్లు, మామూలు పోలీస్ స్టేషన్ల లాగా ఉండవు... బిల్డింగ్ లే కాదు, పోలీసుల విధుల నిర్వహణ తీరు కూడా భిన్నంగా. ప్రజలకి అడుగుఅడుగునా మర్యాదగా ఉంటాయి. స్టేషన్ లో అడుగు పెట్టగానే, ఆత్మీయ పలకరింపులతో, సమస్య అడిగి తెలుసుకుని, సంబంధిత విభాగాలకు పంపిస్తారు.

ఈ పోలీస్ స్టేషన్ ఖర్చు ఎంత ?
ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.1.10 కోట్లు వెచ్చించారు

పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?
ఫిర్యాదుదారులు పోలీసుస్టేషన్‌ లోపలికి అడుగుపెట్టగానే రిసెప్షన్‌ కేంద్రంలోని మహిళా కానిస్టేబుల్‌ వారిని ఆహ్వానిస్తారు.

కార్పొరేట్‌ కార్యాలయాలను తలదన్నేలా ఉంటాయి ఈ స్టేషన్ లు. స్టేషన్ మొత్తం ఏడు విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగానికి ఒక్కో కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. విభాగాల వారీగా డెస్కులు ఉంటాయి.

పోలీసుల ఆహార్యం కూడా, వినూత్నంగా
ఇక్కడ పోలీసులు కూడా వినూత్నంగా కనిపిస్తారు. ఎప్పుడూ వాడే ఖాకీ దుస్తులు ఇక్కడ వాడరు. లేత నీలంరంగు చొక్కా, ముదురు నీలంరంగు ఫ్యాంటు ఈ పోలీసుల యునిఫార్మ్. కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ వరకు, ఈ డ్రెస్ లోనే ఉంటారు. బయటకు వెళ్ళేప్పుడు మాత్రం, ఖాకీ దుస్తులు ధరిస్తారు. ఇక్కడ పోలీస్ లు, ఖటువుగా ఉండరు, ప్రజలతో మమేకమై వారిలో భరోసా కలిపిస్తారు.

మరిన్ని ప్రత్యేకతలు

  • పోలీసుస్టేషన్‌ మొత్తం మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం
  • పోలీసుస్టేషన్‌ మొత్తం సెంట్రల్ ఏసీ
  • పోలీసుస్టేషన్‌ ప్రాంగణం బయట, లోపల మొత్తం నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.
  • పోలీసుస్టేషన్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని డిజటలీకరిస్తారు.
  • కంప్యూటర్ సెక్షన్ కు మరో రూం
  • స్టేషన్‌ హౌస్‌ అధికారి, ఎస్సైల కోసం వేర్వేరుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
  • స్టేషన్ రైటర్ కు ప్రత్యేక రూం
  • సిబ్బంది విశ్రాంతి కోసం ప్రత్యేకంగా డార్మటరీ ఉంటుంది.
  • కస్టడీ గదిని కూడా ఆధునికీకరంగా తీర్చిదిద్దారు. వాళ్ల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.

Advertisements