గన్నవరంలోని, బాపులపాడు మండలం మల్లవల్లి, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది... రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ గా పరిగణించి, పరిశ్రమలు నెలకొల్పటం, మరో పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన మెగా ఫుడ్‌పార్కు నెలకొల్పటంతో లేఔట్ కు, సీఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంతో, మెగా ఫుడ్ పార్కు ప్రాంతాన్ని, ఏపీఐఐసీ శరవేగంగా మౌలకి వసతులు కలిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం ఒక కొలిక్కివచ్చింది. ఫుడ్‌పార్కు అవసరాలకోసం మొత్తం అయిదు రహదారుల్ని నిర్మిస్తున్నారు. ఉద్యానశాఖ మామిడి నర్సరీ కోసం ఉపయోగిస్తున్న వందెకరాలను కేటాయించారు. ఈ మెగా ఫుడ్‌పార్కు ప్రాజెక్ట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లను వెచ్చించనున్నాయి. ఇప్పటికే, రోడ్లు డ్రెయిన్ల నిర్మాణం దాదాపు పుర్తియ్యింది. ఈ 100 ఎకరాల్లో, ఆహార పరిశ్రమలకు ఫ్లాట్ల్ కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు. ఆహార పరిశ్రమల పెట్టుబడి, వాటి సాయిని దృష్టిలో ఉంచుకుని ఫ్లాట్ల్ కేటాయిస్తారు.

అలాగే వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఇందు కోసం, ఇండస్ట్రియల్ హబ్ కోసం, మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసే పనిలో ఉంది, ఏపీఐఐసీ. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ఎల్ అం డ్ టీ సంస్థకు అప్పగించింది.

మల్లవల్లిలో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే ప్రస్తుతం 1250 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. ఖనిజాలను శుద్ధి చేయటంలో దేశంలోనే పేరుగాంచిన ’ ఇందాని ’ గ్రూప్‌ సంస్థ మల్లవల్లిలో గోల్డ్‌ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 30 ఎకరాల కోసం ప్రతిపాదించింది. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. కుమార్‌ - సింటెక్స్‌ సంస్థ కూడా భారీ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింటెక్స్‌ పేరుతో ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే తయారు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. ఇంకా అనేక సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. త్వరలోనే వాటి నుంచి కన్ఫర్మేషన వచ్చే అవకాశం ఉంది.

మల్లవల్లిలో భూములు ఉండటం, మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీ చర్యలు చేపడుతుండటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లవల్లి సమీప ప్రాంతాలలో ఏపీఐఐసీ భారీ స్తాయిలో భూ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisements