ఐటీ అంటే హైదరాబాద్ అనే రోజులు పోయాయి... విభజన పుణ్యం, చంద్రబాబు పాలనా దక్షత, ఇప్పుడు ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూస్తున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో ఐటీ కంపెనీలకు ఒక మంచి వాతావారణం ఉంది, విజయవాడ, గుంటూరు వైపు ఇప్పుడ ఇప్పుడే కంపెనీలు వస్తున్నాయి. గన్నవరంలో HCL లాంటి పెద్ద కంపనీ రాబోతుంది.

ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటివి చాలా తక్కువ అనే భావన చాలా ఐటీ కంపెనీల్లో ఉంది. అందుకే హైదరాబాద్‌ నుంచి వచ్చే విద్యార్థుల్లో మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయని ఐటీ దిగ్గజ కంపెనీలు భావిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ స్థాపించాలంటూ, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులు దొరకుతారని, ఏపీలో ఆ స్థాయిలో విద్యార్థులు ఉండరన్న వాదనను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. కాని రాష్ట్ర ప్రభుత్వం, వారి అభిప్రాయాన్ని విభేదించి, రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని మైక్రోసా్‌ఫ్టకు ప్రభుత్వం సూచించింది.

రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పర్యటించిన మైక్రోసా్‌ఫ్టకు.. రాష్ట్ర విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలు తెలిసొచ్చాయి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు కాస్త పదును పెడితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలకు ప్రధాన మానవ వనరుగా ఏపీ ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు భావించారు. ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్ధుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచటానికి పలు కార్యక్రామాలు రుపొందిస్తుంది.

Advertisements