ఒక పవిత్ర కార్యం జరుగుతుంటే, రాక్షసులు అడ్డుపడటం మనం పురాణాల్లో చదువుకున్నాం... ఈ కలియుగంలో కూడా, అలాంటి రాక్షసులు, పవిత్ర కార్యాలకి అడ్డుపడుతూనే ఉన్నారు... మన దౌర్భాగ్యం, ఈ రాక్షసులు, అమరావతి పేరు పెట్టిన మొదలు, అమరావతిలో ఏ కార్యక్రమం జరిగినా, దాన్ని చెడగొట్టటానికే ప్రయత్నిస్తూ వస్తున్నారు. వీళ్ళకి అమరావతి అంటే ఇష్టం లేదు... ఎలాగైనా అమరావతిలో అశాంతి కలిగించాలి అన్నదే వాళ్ళ ధ్యేయం... అమరావతి శంకుస్థాపన మొదలు "నన్ను పిలవద్దు, నేను రాను" అన్న దగ్గర నుంచి మొదలైన వ్యతిరేకత, నేటి మహిళా పార్లమెంట్ పార్లమెంట్ లో, ఎలా అయినా అలజడి చేసి, అమరావతికి, రాష్ట్రానికి చెడ్డ పేరు తేవాలానే కుతంత్రాల వరకు, సాగుతూనే ఉంది.

అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు, అంగరంగ వైభవంగా, వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా మణులతో కళకళలాడుతూ, మహిళల ఎదుర్కుంటున్న సమస్యలు మీద వివిధ రంగాల పెద్దలు, సమీక్షలు చేస్తూ ముందుకు సాగుతున్న వేళ... కొంత మందికి కన్ను కుట్టుంది. ఇంత సక్సెస్ ఫుల్ గా, సదస్సు సాగుతూ, అమరావతికి, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంటే, ఆక్రోశం బయట పడి... తాతల కాలం నాటి నుంచి ఉన్న వారసత్వంగా వస్తున్న లక్షణం బయటపడింది. వాళ్ళు నవ్వకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, అనే ఆ గుణం, వికృత రూపం దాల్చి.. ఎలా అయినా సరే, అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ అడ్డుకోవాలి అని పక్కా ప్లాన్ తో, రెండు రోజులు నుంచి, చేస్తున్న రెచ్చ గొట్టే ప్రయత్నంతో, బయలు దేరింది ఒక మహిళా మణి. అన్న కాని అన్న, అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నాశనం చెయ్యటానికి వదిలిన బాణం ఈమె..

ఈమె చరిత్ర చాలా ఘనమైనది.. పవిత్రమైన అసెంబ్లీ లో, అసభ్య హావ భావాలు, తోటి మహిళలను బూతులు తిట్టటం, టీవీలో పెద్దలు కూడా చూడలేని గొప్ప కార్యక్రమాల్లో నటించటం, నన్ను రేప్ చేసి దమ్ము నీకుందా అని బహిరంగంగా మాట్లాడటం, నోటికి అద్దు అదుపు లేకుండా రెచ్చిపోవటం.. ఇవి ఆవిడ క్వాలిఫికేషన్స్... ఇలాంటి వాళ్ళు, ఆ పవిత్ర స్థలంలో, జరుగుతున్న పవిత్ర కార్యక్రమానికి వస్తే ? అక్కడ ఉన్న, వేల మంది వనితలకు అవమానం... ఈ కుతంత్రాలు పసి గట్టిన ఇంటలిజెన్స్, ఆమెను ఆ పవిత్ర స్థలానికి రాకుండా అడ్డుకుంది... సదస్సు ప్రిష్టతను, అక్కడ ఉన్న వేలాది అతివల గౌరవాన్ని కాపాడింది పోలీసు వ్యవస్థ...

ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం మీద నిత్యం యుద్ధం చేసే, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు వచ్చి అమరావతిని పొగుడుతూ, ఆంధ్ర రాష్ట్రం చల్లగా ఉండాలి అనే మాటలు విన్నాం... మరో పక్క బుట్టా రేణుక లాంటి వైయస్ఆర్ పార్టీ MP చేసిన ప్రసంగం చూసాం, మరి ఇలా సదస్సుని చెదగోట్టాలి అనే ఎజెండాతో, ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మహిళను, అక్కడకు రానివ్వాకుండా, మంచి వాతావరణంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుని చెడగొట్టకుండా, ముందు జాగ్రత్త తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులను, మహిళలు అందరూ మెచ్చుకుంటున్నారు.

Advertisements