ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఉత్సవాలను ఆంగరంగ వైభవంగా న్విహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూ.550 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 4 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోదండరాముడి కల్యాణం 10న జరగనుంది.

ఒంటిమిట్ల విశిష్టతలెన్నో
సాంఘిక దురాచారాలను రూపుమాపేలా, సమాజంలో అసమానతలు తొలిగేలా దళితులు సైతం గర్భగుడిలో అనాదిగా పూజలు చేస్తున్న గొప్పతనం ఒంటిమిట్ట ఆలయానిది. ప్రతి శుక్రవారం ముస్లింలు కూడా ఈ ఆలయంలో పూజలు చేయడం ప్రత్యేకత. ఏకశిలపై రాముడు, సీత, లక్ష్మణుడు కొలువుదీరి దర్శనమివ్వడం కూడా ఇక్కడ ఒక విశేషం. ఇంకొక విశేషం ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయస్వామి వుండరు. ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

11వ శతాబ్దంలో నిర్మించిన అత్యంత పురాతన దేవాలయం కావడం వంటి అనేక విస్థిష్టతలు ఉన్నందునే చంద్రబాబు ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నారు. నవమి నాడు ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రామచంద్రునికి సమర్పిస్తారు.

Advertisements