ఏడాదికి ఎకరాకు 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ప్రకృతి వ్యవసాయంలోనే ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలకు కాలం చెల్లిందని, ఆ పద్ధతుల వలన రైతులకు నష్టం కలుగుతుందని వినియోగదారులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రైతుల భూములలో భూసారం తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయి అప్పులు పెరిగి వ్యవసాయం మానేసి గ్రామాల నుండి పట్టణాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా యువతకు సేద్యం అంటే తెలియని పరిస్థితి వచ్చిందని, ఉన్న ఆస్తులను తెగనమ్ముకుని పట్టణాలకు వలస వెళుతున్నారని అన్నారు.

వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు లాభాల పంట పండించేందుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని సుభాష్ పాలేకర్ అన్నారు. ద్రాక్ష, స్టాబెర్రీ, యాపిల్, దాల్చిన చెక్క, మిరియాలు వంటి పంటలను ఆంధ్రప్రదేశ్ భూముల్లో కూడా పండించవచ్చని ఆయన అన్నారు. ఎకరాకు 6 లక్షలు నుండి 12 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఒక్క ప్రకృతి వ్యవసాయానికే ఉందని అన్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందిస్తే ఎంతో లాభం గడించవచ్చని అన్నారు.

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పాలసీలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉందంటూ ఈ విషయం ఇప్పటివరకు కాకినాడ, తిరుపతి పట్టణాలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. మరికొంత మంది రైతులకు వచ్చే జనవరిలో హైదరాబాదులో శిక్షణ కార్యక్రమాలు కల్పించి అవగాహన కల్పిస్తామన్నారు. త

మిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఎకరాకు 80 క్వింటాళ్లు పండించిన ఘనత అక్కడి రైతులదన్నారు. వారు రసాయనిక ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు వినియోగించలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 123 కోట్లు ఉందని, భవిష్యత్తులో 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లు పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఎటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఆలోచించాలన్నారు. అయితే ఇప్పటికి దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అదిక ఉత్పత్తులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధిపతులు అంటున్నారని ఆయన అన్నారు.

Advertisements