రాజధాని అమరావతి ప్రాంతంలో, మరో సాఫ్ట్-వేర్ కంపెనీ ఏర్పాటకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంగళగిరిలోని ఏపీఐఐసీ ఐటీ పార్క్ లో, వీసాఫ్ట్ టెక్నాలజీస్, డెవలప్-మెంట్ సెంటర్ ఏర్పాటు చేయ్యనుంది. "వీ-సాఫ్ట్ టెక్నాలజీస్" సంస్థ, ప్రపంచ స్థాయిలో ఆర్ధిక సంస్థల ఖాతాదారులకు తమ సాఫ్ట్ వేర్ ద్వారా సాంకేతిక సేవలు అందించే సంస్థ.

స్థానికంగా 400 మంది పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ మేరకు, వీసాఫ్ట్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. నెల రోజులలో వీసాఫ్ట్ సంస్థ మంగళగిరిలోని ఏపీఐఐసీ ఐటీ పార్క్ 1,882 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు ప్రారంబించనుంది. స్తానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతకే, మొత్తం 400 ఉద్యోగాలను ఈ సంస్థ కల్పించనుంది. మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న తమ సంస్థలో ఉద్యోగాల కోసం 9866699119 నెంబర్ సంప్రదించవలసిందిగా ఆ సంస్థ చైర్మన్ మూర్తి వీరఘంట సూచించారు. మరిన్ని వివరాలకు www.vsoft.co.in వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చన్నారు.

వీసాఫ్ట్ టెక్నాలజీస్ చైర్మన్ మూర్తి వీరఘంట మాట్లాడుతూ 20 సంవత్సరాలు కిందట తమ సంస్థను నెలకొల్పామన్నారు. అమెరికాలో తమ సంస్థకు సంబంధించిన డెవలప్-మెంట్ సెంటర్ ఉందని, హైదరాబాద్, రాజమండ్రిలో కూడా తమ డెవలప్-మెంట్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేయబోయే సాఫ్ట్-వేర్ డెవలప్-మెంట్ సెంటర్ భారతదేశంతో పాటు, అమెరికా, ఆఫ్రికా వంటి విదేశాలలో ఉన్న తమ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఖాతాదారులకు సాంకేతిక సేవలు, పరిష్కారాలు అందించటం ద్వారా మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్ డెవలప్-మెంట్ చేయటానికి, సహకార బ్యాంకుల కార్యకలాపాలకు రానున్న రోజులలో సేవలు అందిస్తామని తెలిపారు.

Advertisements