అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ (విండ్ మిల్ పవర్) వెలుగులు విరజిమ్మనున్నయి. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన గాలిమరల ద్వారా మొత్తం 455.4 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ లక్ష్యం సాధించారు. అదనంగా మరో 750 నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నెడ్ క్యాప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది మార్చి నెలాఖరుకు లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విండ్ మిల్స్ పనులు పురోగతి దశలో ఉన్నాయని నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ కోడదరామయ్య తెలిపారు.

అనంతపురం జిల్లలో ఇప్పటివరకు స్కిరాన్ ఎనర్జీ, గ్రీన్ కోర్, టాటా పవర్, హీరో ఫీచర్స్ ఎనర్జీస్, ఎకొరాన్, అదానీ, ఆరంజ్ యాక్స్ప్రెస్ వంటి దాదాపు 12 కంపెనీలు గాలిమరలు ఏర్పాటు చేశాయి. వీటి ఆధారంగా పవన విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

కాగా జిల్లలో సౌర విధ్యుత్ వినియోగంపైనా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేటు సంస్థలు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగించుకుంటున్నాయి. నంబుల పూలకుంటలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. దీని సామర్ధ్యం 1000 మెగావాట్లు. మరో 250 మెగావాట్ల ఉత్పత్తికి టిపిఎ ఖరారు చేయాల్సి ఉంది.

Advertisements