నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉన్న కృష్ణా నదిలో దుబాయ్ లోని హోటల్ క్రూయిజ్ తరహాలో ఒక అందమైన భారీ క్రూయిజ్ హోటల్ అధునాతన వసతులతో ఏర్పాటవుతుంది. సీతానగరం వైపున ఇసుక ర్యంపు దగ్గర ఈ భారీ క్రూయిజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అత్యంత భారీగా రెండు అంతస్తులగా ఈ బోటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.

దీని పొడవు దాదాపు 126 మీటర్లు ఉంటుంది, వెడల్పు 40 మీటర్ల ఉంటుంది. ఈ భారీ క్రూయిజ్ నిర్మాణానికి రూ.2 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో దాదాపు 360 మంది యాత్రికులు ఒకే సారి ఉండటానికి అవకాశం ఉంది. దీని లోపల భాగంలో అధునాతన వసతులతో రెస్టారంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో యాత్రికులు కోరిన విధంగా భోజనాలు, కోరిన రుచులతో ఆస్వాదించవచ్చు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. పెళ్లిళ్లకు, హనీమూస్ జరుపుకునే జంటలకు వివిధ రకాల పంక్షన్లకు ఈ క్రూయిజ్ అద్దెకు ఇస్తారు. భవాని ద్వీపం, ఇంద్రకీలాద్రి, నడుమ కృష్ణానది నీటి పై ఈ క్రూయిజీసు లంగరు వేసి ఉంచుతారు. భవాని ఐలాండ్, శాండ్ ఐలాండ్, ఫారెస్ట్ ఐలాండ్స్, వంటి ఎన్నో సహజ సుందరమైన దీవులను కలిగి ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాదారణ బోట్ల మాత్రమే తిరిగేవి.

రాష్ట్రంలో టీడీపి ఆధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఆధునిక క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటకానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎతున పెట్టబడులు వస్తున్నాయి. రాజధాని పరిధిలో ఎన్నో బడా టూరిజం ప్రాజెక్టులను తెచ్చేందుకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ముందుకు వచ్చింది. తొలిదశలో భాగంగా సగానికి పైగా పనులు పూర్తి చేసింది. మిగిలిన పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, స్కై ఛాపర్స్ సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్ట్లు మొదలుపెట్టాయి.

Advertisements