తిరుపతి వైసిపీ అభ్యర్ధి గురుమూర్తిని చంద్రబాబు, లోకేష్ కించపరిచారని, వారి పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి అంటూ, వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయటం పై టిడిపి కూడా కౌంటర్ అటాక్ చేసింది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అంటూ, మంగళగిరి పోలీస్ స్టేషన్ లో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేసారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, "అబద్ధపు మాటలు చెప్పి, అసత్యాలు ప్రచారంతో అసాధ్యపు వాగ్ధానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ దళిత వర్గాలు వైసీపీకి ఎక్కువ శాతం ఓట్లు వేసి గెలిపించి అధికారాన్ని అందించాయో అదే జాతిపై దాడులు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దళిత యువకుడికి శిరోముండనం చేశారు. దళిత వర్గానికి చెందిన బాలికను సామూహిక మా-న-బం-గం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. నేను డాక్టర్ ను మాస్కు ఇవ్వండి అని ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ అడిగితే పిచ్చివాడిగా చూపే ప్రయత్నం చేసి నడిరోడ్డుపై గుడ్డలు లేక్కుండా ఈడ్చుకెళ్లారు. సర్.. మద్యం రేట్లు పెరిగిపోయాయి.. గత ప్రభుత్వంలో ఇంత రేట్లు లేవు, ఇలాంటి పిచ్చి బ్రాండ్లు లేవు అని ప్రశ్నించిన సీఎంను ప్రశ్నిస్తే తెల్లారేసరికి ఆ దళిత యువకుడు చ-ని-పో-యా-డు. ఎందుకు చ-ని-పో-యా-డో ఇప్పటి వరకు కారణం తెలీదు. ఒక జడ్జి నాకు అన్యాయం జరుగుతుందంటే ముద్దాయిల మీద చర్యలు లేవు. పైగా ఒక మంత్రి వాడొక పిచ్చోడు, పనికిరానివాడని మాట్లాడారు. దళిత మెజిస్ట్రేట్ ను అవగాహన రాహిత్యుడు, బందిపోటు మంత్రి వాడూ... వీడూ అని మాట్లాడితే చర్యలు తీసుకోలేదు."

"మాస్కు పెట్టుకోలేదని దళిత యువకున్ని ఇస్టానుసారంగా పోలీసులు కొడితే చ-ని-పో-యా-డు. ఎన్నో ఘటనలు జరిగితే చర్యలు తీసుకోకుండా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి నా కాళ్లు పట్టుకుని, ఫిజియోతెరపీ చేసే దళితునికి తిరుపతి పార్లమెంట్ సీటు ఇచ్చానని అన్నారు. నీకు ఫిజియోతెరపీ చేసిన దళిత డాక్టరుకు సీటు ఇచ్చావు. గురుమూర్తి జగన్ పాదాల దగ్గర కూర్చుని పాదాలు వత్తుతూ ఉన్న ఫోటో వైసీపీ డిజిటల్ వింగ్ లో పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? దీన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, దీన్ని మోనిటరింగ్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి. దళిత వర్గాలను కించపరచాలనే కదా. దళిత వర్గాలు మీ కాళ్ల దగ్గర వుంటాయనేగా. దళిత వర్గాలను మా కాళ్ల దగ్గర పెట్టుకున్నానని చెప్పడానికే కదా. ఫేస్ బుక్ లో కోట్ల మందికి పంపాల్సిన అవసరం ఏంటి.? దళిత వర్గాల మనసులన్నీ బాధపడ్డాయి. దళిత వర్గాలు మీ కాళ్ల దగ్గర ఉన్నాయని చెప్పడానికే ఆ ఫోటో పెట్టారు. అందుకే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశా. ఇందులో యాక్షన్ తీసుకోవడానికి ఆలోచించాల్సి విషయం ఏమీ లేదు. అగ్రవర్ణానికి చెందిన జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాడు.. దళిత జాతికి చెందిన డాక్టర్ గురుమూర్తి ఆయన కాళ్ల దగ్గర ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి దళిత జాతిన అవమనించారని చెప్పడానికి? డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసైనా రిజిస్టర్ చేస్తారా? వైసీపీపై చేసిన ఎన్నో కేసులు బుట్టలో ఎందుకు పడేస్తున్నారో మాకు తెలుసు. డీజీపీగా మీరు ఎంత ఘనత వహించిన రీతిలో ఏపీలో పనిచేస్తున్నారో మా అందరికీ తెలుసు. కనీసం ఈ కేసైనా రిజిస్టర్ చేసి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్టు చేయాలి." అంటూ వర్ల రామయ్య డిమాండ్ చేసారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read