కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో జాతీయ రహదారిపై లిక్విడ్‌ ఆక్సిజ‌న్ గ్యాస్ తో వెళ్తున్న ట్యాంక‌ర్ ప్ర‌మాదానికి గురైంది. వెనుక నుంచి వ‌స్తున్న వాహ‌నం ఢీకొట్ట‌డంతో వెనుక ప్రాంతంలో చిన్న రంద్రం ప‌డింది. దాని గుండా ట్యాంక‌ర్ నుంచి భారీ స్థాయిలో లిక్విడ్ ఆక్సిజ‌న్ గ్యాస్ పొగ రూపంలో భ‌య‌ట‌కు రావ‌డంతో రోడ్డంతా మెఘాల మాదిరి పొగ అలుముకుంది. లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని రోడ్డుపక‍్కన ఆపేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, వాట‌ర్ తో క్లియ‌ర్ చేస్తున్నారు. స‌హ‌జంగా ఉండేవాయువు కావ‌డంతో పెద్ద‌గా ప్ర‌మాదం లేదు. ఆ దారిలో వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్ళిస్తున్నారు. ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisements