జిల్లా కలెక్టర్ బాబు.ఎ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 6వ తేదీ సోమవారం న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్-2017 లో భాగంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్), సహకారంతో రాష్ట్రపతి భవన్ లో జిల్లా కలెక్టర్ బాబు.ఎ కీలక ఉపన్యాసాన్ని చేయనున్నారు.

ఆధార్ తో ఆధారిత ప్రజా పంపిణీ, ఉపాధి హామీ వేతనాల పంపిణీ జన్ ధన్ ఆధార్ మొబైల్(జామ్) బెసిడ్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ఆధార్ ఆధారిత ఎరువుల పంపిణీలో లబ్దిదారుని ఖాతాకు సబ్పీడీ నేరుగా జమచేయటం, ఆధార్ పే వంటి వాటిని దేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలోనే ప్రయోగాత్మకంగా విజయవంతంచేసి దేశవ్యాప్తంగా అమలుకు పునాదివేసిన జిల్లా కలెక్టర్ బాబు.ఎ.ను ప్రత్యేకంగా ఆహ్వానించింది.

కృష్ణాజిల్లా పథకాల అమలుతో నగదు రహిత లావాదేవీలు, జిల్లా వ్యాప్తంగా 35 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లా కలెక్టరు బాబు.ఎ. చేయనున్న ప్రసంగంలో జిల్లాలో విజయవతంగా అమలు జరుగుతున్న నగదు రహిత లావాదేవీల అనుభవాలను వివరించనున్నారు. దేశంలో ఏ ఐ.ఎ.ఎస్ అధికారికి దక్కని గౌరవం జిల్లా కలెక్టర్ బాబు.ఎ కు దక్కనుంది.

Advertisements