విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చే ఆగస్ట్ 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్ట్ 15 నాటికి అన్ని పనులు పూర్తయ్యి, ఫ్లైఓవర్ ప్రారంభించాలని, డెడ్ లైన్, మిస్ అవ్వకూడదని ఆదేశించారు. కృష్ణానది దృష్టిలో ఉంచుకొని కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి గుడి ద్వారం వరకు, అర్జున వీధి, ప్రకాశం బ్యారేజీ, బందరు కాలువలను కలుపుకుంటూ సుందరీకరణ చేపట్టాలని, దీనికి ప్రసిద్ధ ఆర్కిటెక్టుల సహకారం తీసుకోవాలని చెప్పారు. అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

అలాగే విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ దగ్గర నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ డిజైన్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. విజయవాడలో బెంజ్ సర్కిల్ అత్యంత ముఖ్యకూడలి అని, బెంజ్ సర్కిల్ సహజ అందం చెదిరిపోకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలన్నారు. కూడలిలోని 5 రోడ్లను కలిపేలా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగాలని అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ డిజైన్లు తయారుచేయాలని అధికారులకు సూచించారు. విజయవాడ మచిలీపట్నం రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Advertisements