అనుకోని అతిధి ఇంటికి వస్తే... ఆ అతిధి మన ఇష్టమైన నాయకుడైతే... ఆ అతిధే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే.... ఆ టైంలో పక్కన సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకపోతే... ఆ క్షణంలో, ఆశ్చర్యం, ఆనందంతో, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు... సరిగ్గా ఇదే సంఘటన నిన్న విజయవాడ పటమటలో జరిగింది.

ఏపీఎస్టీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు కుమారుడు, కోడలును ఆశీర్వదించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పటమటలంక వచ్చారు. వారిని అశీర్వదించిన అనంతరం ఆయన బయటకు వచ్చేస్తుంటే సీఎం వెళ్లిపోతున్నారేమోనని, సెక్యూరిటీ సిబ్బంది అంతా కార్లు ఎక్కేశారు. అయితే సీఎం మాత్రం కారు ఎక్కలేదు. పక్కనే ఉన్న స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని పిలిచి పద మీ ఇంటికి వెళ్లాం, అని భుజం మీద చేయి వేసి పటమటంలక జాస్తి వారి వీధిలో కాలినడకన బయల్దేరారు. సీఎం వీధిలో నడుచకుంటూ రావడం చూసిన స్థానికులు సంతోషంతో ఇళ్లలోకి బయటకు వచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు.

చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న గాంధీ కుటుంబ సభ్యులు వరండాలో కుర్చీలు వేసి, ఆత్మీయ స్వాగతం పలికారు. తాటాకు ఇంటిని చూసి, ఏంటి ఈ ఇంటిలోనేని ఉండేదని గాంధీని ప్రశ్నించారు. వరండాలో వేసిన కుర్చీలో కూర్చొన్న సీఎం కుటంబసభ్యులందరినీ పేరు, పేరునా పరిచయం చేసుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకే చోట కలిసి ఉండటాన్ని అభినందించారు. కుటంబ పరిస్థితులను నేపధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువులు గురించి వాకబు చేశారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసేవారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. చెన్నపాటి గాంధీ, ఆయన అన్నదమ్ముల కుటుంబ సభ్యులతో కలిసి పొటోలు దిగారు.

అనుకోని అతిధిగా సీఎం తమ వీధిలోకి రావడంతో, చంద్రబాబును దగ్గరుండి చూసేందుకు చిన్నారులు పరుగులు తీశారు. తమ ఇళ్లల్లో చెట్టుకున్న పూలు కోసి ఇచ్చారు. పిల్లలందరితో కరచాలనం చేసి, ఏం చదువుకుంటున్నావు.? మీ ఇళ్లు ఎక్కడ.? మీరు ఏం చేస్తున్నారు.? మీ పాఠశాల ఎక్కడ.? బాగుందా..? మీ నాన్నగారు ఏంచేస్తారు? ఎంతమంది మీరు.? ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. భద్రతా సిబ్బంది అడుగోడ కూడా లేకపోవడంతో వారు స్వేచ్చగా సీఎంతో ముచ్చటించారు. వారిని అభివాదం చేసి, కారు ఎక్కి వెళ్లిపోయారు.

Advertisements