కార్పొరెట్ వైద్యంతో ప్రపంచం కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? కానీ ఇక్కడ వైద్యం ఉచితం. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ముందుకొస్తున్నారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఇందు కోసం ఇంగ్లాండ్ వైద్యులు విజయవాడ వస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో, 80 ఉచిత గుండె ఆపరేషన్లు చేసిన ఆంధ్రా హాస్పిటల్స్, ఈ నెలలో, 100 ఉచిత గుండె ఆపరేషన్లు చెయ్యటానికి సిద్ధం అయ్యింది. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి సౌజన్యంతో హీలింగ్‌ లిటిల్‌హార్ట్స్‌ యూకే సంస్థ వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తారు.

ఈ ఆపరేషన్లు మార్చ్ 19 నుంచి 25 వరకు జరుగుతాయి. గుండె వైద్యం పూర్తిగా ఫ్రీ. ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకునేవరకు ఫ్రీ గా చూస్తారు. మందులు కూడా ఫ్రీ గా ఇస్తారు.

ఉచిత ఆపరేషన్లు చేసుకోవాలి అనుకునే వారు, ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మార్చ్ 7 నుంచి మార్చ్ 9 వ తేది వరకు, రిజిస్టర్ చేసుకుంటారు.. అన్ని టెస్ట్ లు చేసి, ఆపరేషన్ అవసరం అనుకుంటే, మార్చ్ 19 నుంచి 25 మధ్య ఉచితంగా ఆపరేషన్ చేస్తారు.

మరిన్ని వివరాలకు, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో కాని, లేకపోతే 0866-2575999 ఫోన్ నెంబర్ లో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisements