నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటాయంగా నిలుస్తున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిని పొందింది.. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల కంటే వృద్ధి రేటులో దూసుకుపోతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ అతి త్వరలో దక్షిణ, తూర్పు ఆసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా విమానాలు నడపటానికి బీజం పడుతోంది... మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరుగుతోంది... పర్యాటకుల సంఖ్య పెరిగింది... ఆతిథ్య కేంద్రంగా మారిపోయింది.. ఓ కన్వెన్షన్ సెంటర్ మాదిరిగా విమానాశ్రయ లాంజ్లోనే ఉన్నతాధికారుల కాన్ఫరెన్స్ లు జరుపుకునేంతగా మారిపోయింది...

gannavaram airport 26102017 2

ఈ నేపథ్యంలో ఇటీవల రూ.148 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించిన నూతన ఇంటీరియమ్ టెర్మినల్ బిల్లింగ్ దేశంలోని ఇతర ప్రాంతాల వారు, భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఇక్కడి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు వీలుగా అంతర్గతంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనల మేరకు పర్యాటక శాఖ , ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా టెర్మినల్ బిల్లింగ్ అంతర్గతంగా తీర్చిదిదుతున్నారు.

gannavaram airport 26102017 1

అమరావతి ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా బుద్ధుని విగ్రహాన్ని ఉంచారు. పూర్తి స్థాయిలో బౌద్ధ ఛాయాచిత్రాలను తొలగించి కృష్ణాజిల్లా వైభవాన్ని తెలిపేవిధంగా కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యాలు, కలంకారీ కళలు వంటి సంస్కృతి ఉట్టిపడేలా వాటిని ప్రతిబింబించే కళాఖండాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రుల చరిత్ర... అందులో అమరావతి ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవం తెలిసేలా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అత్యద్భుతమైన కళాఖండాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా, పండుగలు వచ్చినపుడు వాటికి థీమ్‌కు అనుగుణంగా అలంకరణ చేపడుతున్నారు. తాజాగా దీపావళిని పురస్క రించుకుని ఎయిర్‌పో ర్టును విద్యుదీ పాలంకరణతో దేదీప్యమానంగా అలంకరించారు.

Advertisements