అన్నీ అనుకునట్టు జరిగితే, అతి త్వరలోనే, గన్నవరం నుంచి మొదటి ఇంటర్నేషనల్ సర్వీస్ మొదలు కానుంది. నెల రోజుల క్రితం అంతర్జాతీయ హోదా సాధించిన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు విమాన సర్వీసు నడిపేందుకు మార్గం సుగమం అవుతోంది. కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు స్వయంగా శ్రద్ధ తీసుకుని, విజయవాడకు ప్రత్యేక సర్వీసు నడిపేలా ఆ దేశ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు.

అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా దీని పై సుముఖంగానే స్పందించినట్టు సమాచారం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు ఇటీవల రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌ష్ తో భేటీ అయిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

శోక్‌ గజపతి రాజు నేతృత్వంలో విమానయాన సంస్థలతో ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానయాన సంస్థ ఆసక్తి చూపింది. నేడు విజయవాడకు అంతర్జాతీయ స్థాయి రావటంతో దానికి మార్గం సుగమం కానున్నది. కస్టమ్స్ కోసం, ఇప్పిటికే భవనం సిద్ధమైంది. కేంద్రం నుంచి అనుమతే తరువాయి.

అన్నీ అనుకునట్టు జరిగితే, గన్నవరం నుంచి, ఎగిరే మొట్టమొదటి ఇంటర్నేషనల్ సర్వీస్ యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు...

Advertisements