విజయవాడ నగర పాలక సంస్థ, డీప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్నహ్యపీ సండే కార్యక్రమానికి బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంతో పాటు, ఇక నుంచి BRTSరోడ్డు కూడా సిద్ధం చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.

హ్యపీ సండేకు విశేష స్పందన రావడంతో ప్రజల సౌకర్యార్ధం రెండు వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హ్యపీ సండే కార్యకమానికి నగరంలో ప్రజాదరణ పెరగటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందని పేర్కొ న్నారు. ఫిబ్రవరి 5వ తేదీన జరిగే హ్యపీసండే కార్యక్రమం రెండు వేదికల్లో జరుగుతాయి అని పేర్కున్నారు. సంప్రదాయ, సమకాలీక జానపద, గ్రామీణ క్రీడలైనటువంటి తొక్కుడు బిళ్ళ, చెమ్మచెక్క పులిమేక, డప్పు, కోలాటం, భరతనాట్యం, కూచిపూడి వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

Advertisements