దశాబ్దాల కల సాకారం కాబోతోంది. బెజవాడ శిగలోకి బిగ్ ఐటీ ఇండస్ట్రీ రాబోతోంది. సాఫ్ట్ వేర్, హార్డ్వేర్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన హెచ్సీఎల్ సంస్థ కేసరపల్లి దగ్గరలోని ఏపీఐఐసీ సెజ్ భూములలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖతో ప్రాధమిక అవగాహనకు వచ్చిన హెచ్-సీ-ఎల్, ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో గేట్-వే హోటలో లో, ఆవగాహన ఒప్పందం కుదుర్చుకొనేందుకు సన్నద్ధమైంది. హెచ్ సీఎల్ ఆధిపతి శివ నాడర్ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు.

ఇదీ ప్రయోజనం..
హెచ్-సీ-ఎల్ సంస్థ రాజధానిలో రూ.500 కోట్ల పెటుబడులు పెట్టనున్నది. ఫలితంగా 5000 మందికి ఉపాధి ఆవకాశాలు కల్పిస్తుంది. ఇందు కోసం పరిశోధన ఆభివృద్ధి ప్రయోగశాల(ఆర్ ఆం డీ ల్యాబ్) ఏర్పాటు చేస్తుంది. అమరావతిలోనూ మరో ఐదు వేల మంది సామర్థ్యం కలిగిన మరో బీపీఓను తరువాత దశలో ఏర్పాటు చేయనుంది.

అంతేకాదూ ఐటీ ఆధారిత సేవలు కూడా అందిస్తుంది. దీంతో పాటు ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి, ఏటా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన 35 వేల మంది విద్యారులకు ఉపాధి ఆవకాశాలు అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తుంది. తన కార్యకలాపాల కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలో సంస్థను ఏర్పాటు చేయనున్నది. ఆప్పటి వరకూ విజయవాడ మేధా టవర్స్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హెచ్-సీ-ఎల్ సిదమైంది.

హెచ్-సీ-ఎ రాకతో బెజవాడ ఐటీ శోభను సంతరించుకుంటోంది. ఇప్పటికే కేసరపల్లి దగ్గర మేధా టవర్స్ లో కొన్ని చిన్న చిన్న ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట జవహర్ ఆటోనగర్ లో తొమ్మిది మధ్య తరహా ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో బెజవాడకు ఓ బిగ్ ఐటీ ఇండస్త్రీ వస్తే బాగుంటుందన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్ళకు హెచ్సీఎల్ రూపంలో ఆ కల తీరబోతోంది. త్వరలో మరిన్ని ఐటీ కంపెనీలు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టనున్నాయి.

Advertisements