అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి మరో దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ, సర్వీసులు నడపటానికి సిద్ధమైంది. దీని కోసం అధ్యయనం చెయ్యటానికి, ‘ఇండిగో’, తన బృందాన్ని ఇక్కడకు పంపనుంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలో పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపటానికి ఫీజుబిలిటీను ఈ బృందం అధ్యయనం చెయ్యనుంది. ఇందుకోసం, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావును, ‘ఇండిగో’అపాయింట్‌మెంట్‌ కావాలని కోరింది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సూచన మేరకు, జూన్ 15, 16 తేదీలలో ‘ఇండిగో’ విమానయా న సంస్థ టెక్నికల్‌ బృందం విజయవాడ రాబోతోంది.

ఇండిగో ఎయిర్‌లైన్స ప్రధానంగా ఎయిర్‌బస్‌ 320, ఎయిర్‌బస్‌ 321, ఏటీఆర్‌ 72 శ్రేణి విమానాలను నడపటానికి వీలుగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నది. ప్రధానంగా రన్‌వే, టాక్సీ వే, ఆఫ్రాన్స, పా ర్కింగ్‌ బేలు, అగ్నిమాపక విభాగం అందిస్తున్న సేవలు, నైట్‌ల్యాండింగ్‌, ఐఎల్‌ఎస్‌ తదితర సాంకేతిక వ్యవస్థల అందుబాటు పై అధ్యయనం చేయటంతోపాటు ఇతర విమానయాన సంస్థలు అందించే సేవలు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల వివరాలు, విమాన ఆపరేషన్స నిర్వహణ వంటి వాటికి సంబంధించి సమగ్ర అధ్యయనం జరపనున్నది.

ఇండిగో వస్తే.. దశ తిరిగినట్టే :
ఇప్పటివరకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నడిచిన విమానయాన సంస్థలన్నీ ఒక ఎత్తయితే.. ఇండిగో ఎయిర్‌లైన్స ఒక్కటే మరో ఎత్తు. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రణాళికా బద్ధంగా సర్వీసులు నడుపుతుంటుంది. ఇండిగో విమానయాన సంస్థ ఏదైనా ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఆషా మాషీగా అడుగు పెట్టదు. ఎంతో అధ్యయనం చేస్తుంది. ఫలానా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నడపాలనుకుంటే ఒకటి, రెండు సర్వీసులతో ప్రారంభించదు. పెద్దమొత్తంలో సర్వీసుల ను నడుపుతుంది. దేశంలోని నలుమూలలకు కనెక్టివిటీ అయ్యేలా సర్వీసులు ప్రవేశపెడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టుకు ఇండిగో ఎయిర్‌లైన్సను తీసుకు రావాలన్న ప్రయత్నాలను ఎయిర్‌పోర్టు అధికారులు పట్టువిడవకుండా చేస్తున్నారు.

Advertisements