నిరుద్యోగ యువతీ,యువకులకు చేయూత నివ్వాలన్న ఆలోచనతో ట్రేడ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈనెల 18న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాల ఛైర్మన బోయపాటి అప్పారావు తెలిపారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారే కాకుండా పలు రకాల డిగ్రీలు చేసిన అనేక మంది యువతీ,యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి చేయూత నివ్వాలన్న ఆలోచనతో ట్రేడ్‌ హైదరాబాద్‌ వారి సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్రేడ్‌ హైదరాబాద్‌లో సుమారు 40 వేల కంపెనీలు రిజిస్టరై ఉన్నాయన్నారు. అందులో 30నుంచి 40 కంపెనీలు ఈనెల 18వ తేదీన నిర్వహిస్తున్న జాబ్‌ మేళాకు వస్తున్నాయని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు వారి వారి సర్టిఫికెట్లతో 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడలోని ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాలకు రావాలని తెలిపారు.

ఆయా కంపెనీలనుంచి వచ్చే ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూలో ప్రతిభకనబర్చినవారికి అదే రోజు సాయంత్రం నియామక పత్రాలు అందజేస్తారన్నారు. జాబ్‌ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బాలశౌరి, ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కామ్‌ సీఈవో వెంకట్‌ బొలెమాని, కళాశాల ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ టి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు, ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి, వివరాలు కనుక్కోవచ్చు, 7032897510, 9030179246, 7337556150 .

Advertisements