రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసి ప్రగతి పధంలోకి నడిపంచేందుకు తీసుకోంటున్న చర్యలలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అన్నారు. సింపుల్ గ్రూప్ ఆఫ్ ఇండియా అధినేత ప్రవాస భారతీయులు పాపారావు ఆధ్వర్యంలో పవిత్రసంగమం వద్ద ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో పర్యాటకుల నదీ విహారయాత్ర నిమిత్తం పడవలపై రిసార్ట్, వాటర్ స్పోర్ట్స్, మెరైన్ ఎక్వేరియం,ఫ్లోటింగ రెస్టారెంట్స్లను ఎం.పి, టూరిజం డైరెక్టర్ శుక్లాతో కలిసి ప్రారంభించారు.

pavitrasangamam 26102017 2

ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిన పాపారావు జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలని సి.ఎం. చంద్రబాబు పిలుపు మేరకు తిరిగి ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పవిత్ర సంగమం వద్ద రిసార్ట్స్ వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. దీనివలన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

pavitrasangamam 26102017 3

దీనితో పాటు అత్యంత ఆధునికమైన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోట్ల తయారీ పరిశ్రమని ఎ.కొండూరులో ఏర్పాటు చేయటం వలన ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు. పిల్లలకు సముద్రంలోని జీవరాశుల పై అవగాహన కల్పించేందుకు మెరైన్ ఎక్వేరియం ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, రిసార్ట్స్ అధినేత పాపారావు, ఇతర పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisements