రామవరప్పాడు రింగ్ లో, కొత్తగా పెట్టిన ట్రాఫిక్ ఆంక్షలతో, వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు... ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో, విజయవాడ పోలీస్, రామవరప్పాడు రింగ్ లో కొన్ని మార్పులు చేసారు...

ఏలూరు రోడ్డు మార్గం నుంచి విజయవాడ వచ్చే వాహనచోదకులు రామవరప్పాడు రింగ్ చేరుకోగానే బాబూజగజ్జీవన్రామ్ విగ్రహం ముందు నుంచి జాతీయరహదారి పైకి రావటం కుదరదు. అక్కడ బారీకేడ్లు పెట్టడంతో బాబూజగజ్జీవన్రామ్ విగ్రహం వెనుక నుంచి ఇన్హోటల్ మీదుగా రామవరప్పాడు వైపు వెళ్లి శుభం కల్యాణ మండపం వద్ద గల సర్కిల్ నుంచి యూటర్న్ తీసుకుని తిరిగి రామవరప్పాడు రింగ్ చేరుకుని అక్కడ నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఏలూరు రోడ్డు నుంచి, ఆటోనగర్, బందర్ రోడ్డు వెళ్ళే rtc బస్సులు కూడా, శుభం కల్యాణమండపం దాకా వచ్చి, యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది.

ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గన్నవరం వైపు వెళ్లాలంటే శుభం కల్యాణమండపం వద్దకు వచ్చి యూటర్న్ తీసుకుని గన్నవరం వైపు వెళ్లాల్సి ఉంది. రామవరప్పాడు రింగ్ దగ్గర యూటర్న్ తీసుకోవటం కుదరదు.

ఇన్నర్ రింగ్ రోడ్డు పై నుంచి వచ్చే వాహనాలు, బెంజిసర్కిల్ వైపు వెళ్ళాలి అంటే, శుభం కల్యాణమండపం దగ్గరే యూటర్స్ తీసుకుని బెంజిసర్కిల్ వైపుకు రావాల్సి ఉంది.

అటు రింగ్ రోడ్డు, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు శుభం కల్యాణ మండపం వద్ద యూటర్స్ తీసుకుని, బెంజిసర్కిల్ వైపుకు వెళ్లేలా చర్యలు తీసుకోవడంతో రామవరప్పాడు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నిబంధనల వల్ల ప్రజలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం పునరాలోచించాలని, వాహనచోదకులు కోరుతున్నారు. మొత్తం తీసేవేయలేని పక్షంలో, కనీసం ఏలూరు రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను బెంజిసర్కిల్ వైపు వెళ్ళడానికి పాత విధానంలో అనుమతిస్తే కొంతమేర సమస్య పరిష్కారం అవుతుందని వాహనచోదకులు, అభిప్రాయ పడుతున్నారు.

Advertisements