స్వచ్ఛ సర్వేక్షణ్-2O17లో భాగంగా స్వచ్ఛ బెజవాడను సాధించి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలో స్వచ్ఛత కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరవాసులను చైతన్యవంతం చేసేందుకు వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ కృషిలో భాగంగానే చెస్ లో ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి, పద్మశ్రీ కోనేరు హాంపిని "స్వచ్ఛ బెజవాడ" కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.

బెజవాడను దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిపేందుకు కమిషనర్ వీరపాండియన్ తీసుకున్న చర్యల్లో భాగంగా విజయవాడ బ్రాండ్ అంబాసిడర్ గా నగరవాసిగా ఉన్న పద్మశ్రీ కోనేరు హాంపిని ఎంపికచేశారు. స్వచ్ఛత యాప్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ముందుగా నగర స్వచ్చత పై హాంపి ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత సర్వే నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా స్వచ్ఛ బెజవాడకు బ్రాండ్ అంబాసిడర్ గా సేవలందించేందుకు అంగీకరించిన కోనేరు హాంపిని నగర మేయర్ కోనేరు శ్రీధర్ సోమవారం తన ఛాంబర్లో జరిగిన సమావేశంలో అభినందనలు తెలియజేశారు. ఆమెను శాలువతో సత్కరించి, జ్ఞాపికను అంద జేశారు.

కోనేరు హంపీ మాట్లాడుతూ, నగర ప్రజల సహాకారం ఉంటేనే నగరాన్ని స్వచ్చ బెజవాడగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నగరవాసులందరూ సహాకారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట విభజన అనంతరం అమరావతిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహోరాత్రులు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో కీలక నగరంగా, తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరం గతం కంటే ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆమె గుర్తు చేశారు. ప్రధమస్థానం వచ్చేందుకు ఇప్పడు జరుగుతోన్న ప్రయత్నంలో తాను శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisements