అభివృద్దిలో దూసుకుపోతున్న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి, మరో సరి కొత్త ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభించనుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మరియు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి పూర్తి అనుమతులు వచ్చాయి.

ముంబైకి చెందిన జూమ్‌ ఎయిర్‌లైన్సు సంస్థ, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నడపటానికి ముందుకు వచ్చింది. వచ్చే మే నెలలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి జూమ్‌ ఎయిర్‌లైన్స్, ముంబై నగరంతో పాటు జైపూర్‌కు విమాన సర్వీసులు నడపనుంది. విజయవాడ నుంచి దేశ రాజధాని న్యూఢి ల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాలకు వివిధ విమానయాన సంస్థలు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి.

ఇప్పుడు, మహారాష్ట్ర ముఖ్యపట్టణం ముంబై, రాజస్థాన ముఖ్యపట్టణం జైపూర్‌లకు విమాన సర్వీసులు నడపటంతో, మరింత కనెక్టివిటీ పెరగనుంది. వ్యాపార వర్గాలకే కాక, విదేశాలకు వెళ్ళేవారికి, పర్యటకంగా వెళ్ళేవారికి కూడా, ఈ సర్వీసులు ఉపయోగపడతాయి.

Advertisements