చంద్ర‌బాబు వ‌ల్లే బ‌తికి ఉన్నామ‌ని, బాబు ప్లేసులో జ‌గ‌న్ ఉంటే త‌మ‌ని చంపించేవార‌ని కొండా ముర‌ళి, సురేఖ‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ఎంత క్రూరంగా ఉంటాడో వారు వివ‌రించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌న ప్ర‌త్య‌ర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి కొండా మురళిని ఎన్‌కౌంటర్‌ చేయాలని కాళ్లా వేళ్లా ప‌డి బ‌తిమ‌లాడినా సీబీఎన్ ఒప్పుకోలేద‌ని, సీఎంగా జగన్ అప్పుడు అయి ఉంటే తనను ఎన్‌కౌంటర్‌ చేయించి ఉండేవారని కొండా మురళి వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. జగన్ రెడ్డిది వక్రబుద్ది అని దుయ్య‌బ‌ట్టారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్ కి ఎమ్మెల్సీ ఇస్తామ‌ని త‌మ‌కు చెప్పి, ఆరు కోట్లు తీసుకుని వేరొక వ్య‌క్తికి జగన్ అమ్మేశార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కి జ‌నం రాక‌పోతే, ఏడ్చుకున్నార‌ని,  దీంతో బస్సులు పెట్టి 25వేల మందిని త‌ర‌లించామ‌ని దంప‌తులు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఆదేశిస్తే పార్టీ తరపున తాము ఏపీలో ప్రచారం చేస్తామని, జగన్‌ వ్యక్తిత్వం ఎలాంటిదో అక్కడి ప్రజలకు వివరిస్తామని కొండా దంపతులు వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ కోసం పదవులకు రాజీనామా చేసినందుకు తాము ఎన్నడూ బాధపడబోమని.. కానీ ఆయ‌న త‌న‌యుడు జగన్ మోహ‌న్ రెడ్డితో నడిచినందుకు మాత్రం తీవ్ర ఆవేద‌న చెందుతున్నామ‌న్నారు. జగన్‌ కోసం తెలంగాణ ద్రోహులమ‌య్యామ‌ని, మానుకోట రాళ్లదాడిని ఎదుర్కొన్నామ‌ని ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో అస్స‌లు న‌మ్మ‌కూడ‌ని నాయ‌కుడు జగన్ అని కొండా దంప‌తులు వివ‌రించారు.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను సింగిల్ సింహాన్ని అంటూ మేక‌పోతు గాంబీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారే కానీ..చంద్ర‌బాబు ప‌న్నిన త్రిశూల వ్యూహంలో చిక్కుకుని విల‌విల్లాడుతున్నాను. ఆఫ్రికా మోడ‌ల్ మూడు రాజ‌ధానుల‌కి ఆద్యుడు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై మూడు ప్రాంతాల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ అమ‌లు చేసి చంద్ర‌బాబు త‌న మాస్ట‌ర్ మైండ్ మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. రాయ‌ల‌సీమలో పాద‌యాత్ర ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టారు నారా లోకేష్‌. సీమ‌లో అడుగు పెట్టారు చంద్ర‌బాబు. మ‌రోవైపు గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఊపు తెచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించారు. వీటిని నిర్వ‌హించే బాధ్య‌త టిడిపి ఏపీ అద్య‌క్షుడు అచ్చెన్నాయుడుకి అప్ప‌గించారు. ఎక్క‌డ ఎవ‌రిని ఎలా ఎదుర్కోవాలో జ‌గ‌న్ ఆలోచించే లోపే టార్గెట్ పూర్తి చేసి వ‌చ్చేలా మెరుపు ప‌ర్య‌ట‌న‌లు ప్లాన్ చేశారు బాబు. ఎటాకింగ్ మోడ్ కూడా డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశారు. ఓ వైపు జ‌గ‌న్ రెడ్డి అవినీతిని, అస్త‌వ్య‌స్థ పాల‌న‌ని ఎండ‌గడుతూనే...మ‌ళ్లీ వైసీపీకి అవ‌కాశం ఇస్తే జ‌నానికి బ‌తికే చాన్స్ లేద‌ని చైత‌న్యం చేస్తూనే...టిడిపి అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కి చేసే మేలు-రాష్ట్రాభివృద్ధి ప్ర‌ణాళిక‌లు వివ‌రిస్తున్నారు.

జ‌గ‌న్ రెడ్డికి కావాల్సింది బాబాయ్ హ‌త్య‌కేసు నుంచి తాను త‌ప్పించుకోవ‌డం, త‌మ్ముడు అవినాష్ రెడ్డిని త‌ప్పించ‌డం. కేసీఆర్ కి అత్య‌వ‌స‌ర‌మైన‌ది ఢిల్లీ లిక్క‌ర్ స్కాములో కుమార్తె క‌విత ఎట్టి ప‌రిస్థితుల్లో అరెస్టు కాకుండా చూడ‌టం. దేశాన్నిఅంతా శాసిస్తూ దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీలో  మాత్రం త‌మ‌కి అడుగడుగునా అడ్డుత‌గులుతున్న కేజ్రీవాల్‌ని అడ్డు తొల‌గించుకోవ‌డం బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ముందున్న ప్ర‌థ‌మ ల‌క్ష్యం. ఈ ముగ్గురి అవ‌స‌రాలు తీర్చేందుకు ఒకే ఒక దారి దొరికింది. అదే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో వైసీపీ నేత శ‌ర‌త్ చంద్రారెడ్డిని అప్రూవ‌ర్‌గా మార్చ‌డం. ఢిల్లీ లిక్క‌ర్ స్కాములో శ‌ర‌త్ చంద్రారెడ్డిని అప్రూవ‌ర్ గా మార్చ‌డంలో ఏపీ సీఎం జ‌గన్ రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. అటు బీజేపీ చెప్పిన‌ట్టు త‌లాడించిన వెంట‌నే వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి సేఫ్ అయిపోయాడు. జ‌గ‌న్ రెడ్డిని విచారించాల్సిన సీబీఐ మౌనం దాల్చేసింది. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో క్వీన్ అని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె క‌విత పేరు చార్జిషీట్లలో క‌నిపించ‌లేదు. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ కి చెక్ పెట్ట‌డానికి ఇటు జ‌గ‌న్ రెడ్డి గ్యాంగ్‌ని, అటు క‌విత సిండికేట్‌ని కూడా వ‌దిలేశార‌ని స్ప‌ష్టం అవుతోంది. కేజ్రీవాల్ చాలా అమాయ‌కంగా కేసీఆర్, జ‌గ‌న్ రెడ్డితో చేతులు క‌లిపి ఎంత పెద్ద త‌ప్పు చేశానో అని ఇప్పుడు అర్థం చేసుకుని ఉంటారు. అయితే చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుని ఏం ప్ర‌యోజ‌నం లేద‌న్న చందంగా మారింది ప‌రిస్థితి. ఢిల్లీ మద్యం కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన వెంట‌నే ప‌రిస్థితుల‌న్నీ ఈ సిండికేటులో కీల‌కంగా ఉన్న జ‌గ‌న్ గ్యాంగ్, కేసీఆర్ ఇంటి మ‌నుషుల‌కి అనుకూలంగా మారిపోయి రిలీఫ్ దొరికేస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా భార్య మంచంపై ఉంది. అయినా ఆయ‌న‌కి బెయిల్ దొర‌క‌లేదు. ఈ లిక్క‌ర్ స్కాంలో పెద్ద చేయి అయిన కేసీఆర్ కుమార్తె క‌విత పేరే మాయం చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వ‌రెడ్డికి రిలీఫ్ ఇచ్చేశారు.  ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం అక్క‌డ కేజ్రీవాల్ మ‌నుషుల‌తో క‌లిసి చేసిన జ‌గ‌న్ రెడ్డి, కేసీఆర్ మ‌నుషులు అదే కేసులో ఎటువంటి సంబంధం లేన‌ట్టు త‌ప్పించుకుని..పూర్తిగా కేజ్రీవాల్ ని ఇరికించేశారు.

సింగిల్ సింహంని ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. వై నాట్175 ఏమో కానీ 17 కూడా వ‌స్తాయో రావో కూడా డౌట్ కొట్టేస్తోంది. చేతిలో అధికారం మాత్రమే ఉంది. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య‌ ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌నే అప‌హాస్యం చేసేలా బ‌రితెగిస్తున్నార‌నే రోజుకొక విస్తుగొలిపే ఓట్ల స్కాం బ‌య‌ట‌ప‌డుతోంది. టిడిపి గెలిచే చోట వారి సానుభూతిప‌రుల ఓట్ల తీసివేత‌, వైసీపీ ఓడిపోయే చోట దొంగ ఓట్లు చేర్పించ‌డం ఇదే రాష్ట్ర‌మంతా సాగిస్తోంది వైసీపీ.
విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో వార్డులు, బూతులవారీగా టిడిపి సానుభూతిప‌రుల ఓట్ల గల్లంతుపై టిడిపి ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఈ స్కాం వెలుగు చూసింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించకుండా ఓట్లు తొలగించారని, దాదాపు 40 వేల ఓట్లు తొలగించార‌ని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.గుంటూరు పట్టాభిపురం 36 డివిజన్ లోని ఒకే డోర్ నెం. తో123ఓట్లు, అదే ఇంటి నెంబర్ తో33వ డివిజన్ పండరిపురం లో300ల ఓట్లు చేర్పించిన అధికారుల గుట్టుని టిడిపి నేత‌లు ర‌ట్టు చేశారు. గతంలో నివాసాలుగా ఉండి, నేడు స్కూల్ గా మార్చిన 36వ డివిజన్ లోని భవనంలో137ఓట్లను చేర్చించిన కార్పొరేషన్ అధికారుల అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా టిడిపి నేతలు బ‌య‌ట‌పెట్టారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలా వైసీపీ వంద‌ల సంఖ్య‌లో దొంగ ఓట్లు చేర్పించిన వైనంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కార్పొరేష‌న్ అధికారుల‌కి ఫిర్యాదు చేశారు.

Advertisements

Latest Articles

Most Read