ఇది చంద్రబాబు పాలన పై ఒక సామాన్యుడి అభిప్రాయం... సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న పోస్ట్....

గతం లో
ఎం ఆర్ ఒ కార్యాలయానికి
ఆర్ డి ఒ కార్యాలయానికి
రవాణా కార్యాలయానికి
చెప్పులరిగేలా తిరిగి చేతులు కాల్చుకొన్న
అనుభవం తో ఓ స్థాయి ద్వేషం ఏర్పడింది
ప్రభుత్వ కార్యాలయాలు అంటే

కాని గత రెండేళ్ల నుండి
ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని
వరుసగా నాకు క్రింది షాక్ ట్రీమెంట్లు ఇచ్చి
గౌరవం ఏర్పడేలా చేసాయి

2G 21122017 2

రాజధాని కోసం ఇచ్చిన భూములకు రెండొ విడత
కౌలు డబ్బులు రాలేదు అని డెప్యూటీ కలెక్టరు కు ఫోన్ చేస్తే
సర్వే నంబరు మీ పేరు వివరాలు ఎస్ ఎం ఎస్ పంపండి అన్నారు
కట్ చేస్తే
ఓ 15 రోజుల తరువాత బ్యాంకు నుండి ఎస్ ఎం ఎస్
డబ్బులు పడ్డట్టు

ఊర్లో కొందరికి రెండో విడత రుణమాఫీ పత్రాలు అందలేదు
అంతర్జాలం లో మండల వ్యవసాయ శాఖ అధికారి
నంబరు దొరకబుచ్చుకొని ఫోన్ చేస్తే
ఆధార్ నంబర్లు వాట్సప్ లో పంపమన్నారు
కట్ చేస్తే
వారం తిరిగేసరికి వాట్సప్ కాల్ చేసి
పొరపాటున మీ రుణమాఫీ పత్రాలు వేరే ఊరికి వెళ్లాయి
మండల వ్యవసాయ కార్యాలయం లో తెచ్చి పెట్టాము
వచ్చి వెంటనే పట్టుకెళ్లండనే పిలుపు

పట్టభద్రుల ఓటరు నమోదును అంతర్జాలం ద్వారా చేస్తే
వి ఆర్ ఒ నుండి ఫోన్ … నా మైల్ ఐ డి ఇది
వెరిఫికేషన్ కోసం మీ డిగ్రీ మార్కుల జాబితా ను పంపండి అని
కట్ చేస్తే
పట్టబద్రుల ఎన్నికల వారం ముందు
మళ్లీ వి ఆర్ ఒ అసిస్టెంట్ నుండి ఫోన్
మీ పట్టభధ్రుల ఓటరు స్లిప్ వచ్చింది
తీసుకెళ్లండి అని

2G 21122017 2

ఇంటివద్దకు వచ్చి మా అమ్మతో
ఊర్లోని ఓ డ్వాగ్రా సంఘ నాయకురాలు
ఫోన్ చెయ్యించారు ….
మీ ఆధార్ కార్డు ప్రకారం
మీకు గ్యాసు కనెక్షన్ లేదని వుంది
ఇప్పుడు ప్రభుత్వం గ్యాసు కనెక్షను ఇస్తోంది
కావాలంటే చెప్పండి నమోదు చేసుకొంటాము అని
నేను వుంది మాకు అవసరం లేదు అంటే
వున్న గ్యాసు కనెక్షను నంబరు వివరాలు
నమోదు చేసుకొని వదిలిపెట్టింది నన్ను ఆ మహిళ

వి ఆర్ ఒ అసిస్టెంట్ నుండి ఫోన్
మీ ఆధార్ నంబరు బ్యాంకు అకౌంట్ నంబరు ఇవ్వండి అని
ఎందుకు అంటే కరువు వల్లా వచ్చిన వేరు శనగ పంట నష్టం తాలూకూ
డబ్బులు వెయ్యాలి అని
కట్ చేస్తే
వారం తిరిగే సరికి అకౌంట్లో ఐదువేల రెండు వందలా ఎనభై రూపాయలు
పడ్డట్టు ఎస్ ఎం ఎస్ వచ్చింది

పల్స్ సర్వేకి
నేను వి ఆర్ ఒ చేతికి దొరకలేదు
దీపావళి పండగ రోజు దొరకబుచ్చుకొని
సర్వే పూర్తి చేసాడు

కొబ్బరి చెట్ల పొలం లో డ్రిప్ వేద్దామని
నాగార్జునా వాళ్లకు ఫోన్ చేస్తే
సరిగ్గా రెండు గంటల్లో వాలారు ఇద్దరు
మరో రెండు గంటల్లో సర్వే పత్రాలు ఓ ఐదు వందలు
తీసుకొని వెళ్లారు
కట్ చేస్తే గతవారం
త్వరలో మీరు డిపాజిట్ కట్టాల్సి వుంటుంది
ఎక్సెస్ మెటీరీల్ కు అని వాల్లనుండి ఫోన్

ఇలాంటి పనులకు ముందైతే
తిరగడానికి పెట్రోలు
సమయం
లంచాలు
ఎంత ఖర్చయ్యేవో లెక్కేసుకొంటే

నా ఒక్కడికే జరిగిన వింత అనుభవాలు ఇవి
ఇలాంటి విచిత్రాలు జనాలకు ఎన్నో

ఈ అనుభవాలు
శాశ్వతం చేసుకోవాలనుకొంటే
చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read