ఇది ఎవరు రాసారో తెలీదు కాని, చాలా బాగా రాసారు... రాసిన వారికి క్రెడిట్స్ ఇస్తూ...

బిడ్డ పుడితే వెంటనే పిల్లపేర ప్రతినెలా పోస్టాఫీసులో ఆర్.డి. కడుతున్నాం. పెద్దయ్యాకా పెళ్లికో, చదువుకో ఉపయోగపడతాయని. అంతముందు చూపున్న మాకు మీ ముందు చూపంటే అసూయ. 2000 సంవత్సరంలోనే మీరు విజన్ 2020 అని 20ఏళ్ల తర్వాత రాష్ట్రం ఎలా ఉంటుందో ఊహించారు. 20ఏళ్ల తర్వాత నీటిసంక్షోభం రాకుండా ఇంకుడు గుంతలు తవ్వి వాననీటిని దాచండనన్నారు. 20ఏళ్ల తర్వాత జనాభా భారీగా పెరుగుతుందని ఫ్లైఓవర్లు కట్టించారు. విజన్ ట్వంటీట్వంటీ అంటే సన్నాసుల్లాగా మేము మిమ్మల్ని 420 అని వాగాం.

1100 call center 13012018 3

లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మని అడిగాం. ఔట్ సోర్సింగ్ అంటే అంతెత్తున లేచాం. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే అది జరగని పని. సగం ఊరి జనం పెట్టుకుంటే సగం ప్రభుత్వం ఇస్తుందని జన్మభూమి పెట్టారు. ప్రజల భాగస్వామ్య ఎప్పుడైతే ఉంటుందో దానిని పదిలంగా చూసుకోవాలి అనే భావన, ఇది మాది అనే బాధ్యత ప్రజల్లో వస్తుందని మీరు తలచారు. మా కర్మకి దానిని వ్యతిరేకించాం.

1100 call center 13012018 2

ఇంట్లో కళ్యాణం చేయాలంటే అప్పు చేయకతప్పదు అత్యధికులకు. అలాంటిది లోకకళ్యాణం కోసం మీరు అప్పులు తెస్తే ప్రపంచబ్యాంకు జీతగాడు అన్నాం.ఈరోజు ప్రపంచబ్యాంకు అప్పు తీసుకురాని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేని, నీటిసంరక్షణ పాటించని రాష్ట్రం ఉందా? కాంగ్రెస్, కమ్యునిస్టు, బీజేపీ, టీఆర్ఎస్, ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మీరు ఆరోజు చెప్పినవే చేస్తున్నారు కదా?

మీ ముందు చూపు, మీ దూకుడు, మీ హార్డ్ వర్క్ అంటే మాకు ఎలర్జీ. మీరు ఏది చెప్పినా దానిని వ్యతిరేకించడమే మాకు తెలుసు. మేం వెటకారం చేస్తాం. పళ్లికిలించి నవ్వుతాం. మీకు ఆంధ్రుల మద్దతు, అభివృద్ధి కాముకుల మద్దతు ఉంటుందోమో కానీ మాలాంటి అసురుల మద్దతు ఎప్పటికీ ఉండదు మీకు గుర్తుపెట్టుకోండి

Advertisements

Advertisements

Latest Articles

Most Read