amaravati registratoin 03022017

రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్‌ జిల్లాను ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంత ప్రజల అవసరాల కోసం అమరావతి పేరుతో కొత్త రిజిసే్ట్రషన్‌ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి తెలిపారు. తుళ్లూరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా శుక్రవారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

రాజధాని పరిధిలో కొత్తగా 4 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తుళ్లూరులో నూతన సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలిపారు. మందడం, ఉండవల్లి, అనంతవరం గ్రామాల్లో మూడు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్ని అన్నారు.

ఈ కార్యాలయాల పరిధిలోనే రాజధాని ప్రాంతంలోని భూములు క్రయ, విక్రయాలు ఏ రిజిస్ట్రేషన్లకు అయినా ఇక్కడే లావాదేవీలు నిర్వహిస్తారు. రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ల పరంగా మున్ముందు ఎలాంటి వివాదాలకు తావుండకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read