cbn in jurich 17012017

"మా రాష్ట్రం 2 సంవత్సరాల శిశువు. ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలి. అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, మీ అందరి సహకారం కావాలి"... ఇది ఒక ముఖ్యమంత్రి చేస్తున్న అభ్యర్ధన లాగా ఉన్నా.... మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది ఈ కష్టం ఏంటో....

ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చెయ్యాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడాలి... ఎక్కే గడప, దిగే గడప... ఎవరు ముందుకు వస్తారో తెలీదు... అయనా సరే, ఒక ఆశతో ముందుకు వెళ్ళాలి... ఇవి మనం రోజు చూస్తూనే ఉంటాం... మన ఇంటికి ఎవరన్నా మార్కెటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు జరిగే సీన్ లు ఇవన్నీ... ఇప్పుడు ఇదే తరహాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో, ఇదే మార్కెటింగ్ పని చేస్తున్నారు... ఎంతో ఆశతో, ఒక్క పెట్టుబడి అయనా రాకపోతుందా అంటూ ముందుకు సాగుతున్నారు... ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఈ రాష్ట్రానికి నెంబర్ 1 కూలీ అని... అలాగే కష్టపడుతున్నారు... హైదరాబాద్ లో పెట్టుబడుల కోసం, చేతిలో ఫైల్స్ పట్టుకుని, అమెరికా వీధుల్లో ఎలా తిరిగారో, ఇప్పుడు మళ్ళి అలాగే, జ్యురిచ్ వీధుల్లో తిరుగుతున్నారు..ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు... చిన్న కంపెనీ, పెద్ద కంపనీ అని తేడా లేదు... మన రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసే పనిలో ఉన్నారు... వన్ టు వన్ మీటింగ్స్ పెట్టి, పెట్టుబడులు పెట్టమని అందరినీ అడుగుతున్నారు. ఇవన్నీ మన కోసమే, మన పిల్లల కోసమే, మన బంగారు భవిషత్తు కోసమే...

చూడండి ఎలా మార్కెటింగ్ చేస్తున్నారో... మన రాష్ట్రానికి ఎలా బ్రాండింగ్ చేస్తున్నారో... ఇవన్నీ మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం... క్రింద వీడియో చూడండి, ఆయన కష్టం ఏంటో మీకే అర్ధం అవుతుంది...

"మీరు మా అమరావతి రండి, మా రాష్ట్రం రండి.. జరుగుతున్నది చూడండి... పెట్టుబడులు పెట్టండి... ప్రైవేటు పెట్టుబడులకి బెస్ట్ డెస్టినేషన్… రాజధాని లేకపోయినా ఆకర్షణలో తిరుగులేని రాష్ట్రం అంటూ అవార్డులు, రివార్డులు ప్రస్తావిస్తూ... మీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాను... 24/7 పవర్, వాటర్... పవర్ సెక్టార్ లో మమ్ముల్ని కొట్టినోడు లేడు... ప్రతి ఇంటింకి ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ ఇస్తున్నాం... ప్రతి ఇంటిని ఒక నాలెడ్జి ప్లేస్ గా తీర్చిదిద్దుతున్నాం... మాకు సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు... వ్యవసాయం,పారిశ్రామికం రెండు బాలన్స్ చేస్తున్నాం... ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము టాప్... ఇవన్నీ నేను చెప్పటం కాదు, మా గ్రోత్ రేట్ చూడండి... డబల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉన్న ఏకైక రాష్ట్రం మాది.... వచ్చే సంవత్సరం కూడా మేము డబల్ డిజిట్ గ్రోత్ సాధిస్తాం... మేము పోటీ పడేది, ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్కడ ఉన్నా వాటితో... అమరావతి ని వరల్డ్ టాప్ 10 సిటీస్ లో ఉంచటమే నా ధ్యేయం... నేను తప్పకుండా అది సాధించి తీరుతా.."

మేం రెడీ అంటూ.. ముందుకొచ్చిన దిగ్గజ సంస్థలు

  • విశాఖలో హైస్పీడు ఇంజన్లు, రైలు పెట్టెల కర్మాగారం, ప్రపంచశ్రేణి సంస్థ ‘స్టాడ్లర్ రైల్ మేనేజ్‌మెంట్’ సంసిద్ధత
  • స్విట్జర్లెండ్ సహా మరికొన్ని దేశాల్లో బహుళ విద్యుత్ ఉత్పాదన రంగంలో దిగ్గజంగా ఉన్న స్విట్జర్లెండ్‌కు చెందిన ‘బి.కె.డబ్ల్యు ఎనర్జి ఎ.జి’ ( Bernische Kraftwerke AG) సంస్థ ఆంధ్రప్రదేశ్ లో జలవిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి ముందుకు వచ్చింది.
  • Gherzi కార్పొరేషన్ - శస్త్ర చికిత్సలు, వైద్య చికిత్సలో కీలకమైన blood plasma fractionationలో పేరున్న ఈ కార్పొరేషన్ రూ. 2 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచింది
  • ఎనర్జీ, ఇండస్ట్రీ, ఇన్ఫ్రా రంగాలలో పేరున్న POYRY సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. థర్మల్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్లో అనుభవం, 120 ఏళ్ల చరిత్ర POYRY సొంతం.
  • పర్యావరణ హితమైన, అత్యాధునిక పెయింటింగ్స్ తయారీ సంస్థ ఎలక్ట్రో పెయింట్స్ ఎస్ఏ గ్రూప్‌ ఆసియాలో వ్యాపార విస్తరణ కోసం భారత్ వైపు చూస్తోంది. ఇందులో భాగంగా తనను కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు ఏపీకి వచ్చి పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
  • డిజిటల్ మనీ, డిజిటల్ ట్రాన్సక్షన్స్, ఆర్ధిక సాంకేతిక అంశాలపై రాష్ట్రాన్ని ముందువరుసలో నిలపాలన్న ముఖ్యమంత్రి ఆశయాలను నిజం చేసేందుకు ఈ రంగంలో అగ్రగామి సంస్థ అయిన మొబినో ముందుకొచ్చింది.
  • ఐటీ మేళవింపుతో ఆరోగ్య భద్రత కల్పించడంలోనూ పేరుగాంచిన డ్యూర్ టెక్నాలజీస్, టీబీ మహమ్మారిని రూపుమాపేందుకు భారతదేశంలో పనిచేయాలని భావిస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదనలు ఉంచింది
  • వ్యర్ధాలను మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ప్రఖ్యాతిగాంచిన Baumgarte సంస్థ తమ సాంకేతికతను నవ్యాంధ్రప్రదేశ్‌కు, అమరావతికి అందించేందుకు ముందుకువచ్చింది
  • జర్మనీలో ఇ.ఇ.ఎ.ఆర్.సి వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్ వంగపండు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వైమానిక, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధనలు చేశారు. ఆటోమొబైల్ క్లస్టర్ల ఏర్పాటులో సహకరించటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
  • చైనాలో దోమ తెరల తయారీలో పేరొందిన Trittec సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఆధునిక దోమ తెరలు, విండో ఫ్రేమ్స్ రూపకల్పనలో పేరొందిన ట్రిట్టెక్ ధారాళంగా గాలి ప్రసారిస్తూ, క్రిస్టల్ క్లియర్ వ్యూతో కూడిన మెష్‌లు, అత్యంత పలచటి నెట్ల తయారీలో మేటిగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఈ సంస్థ ఆసక్తి కనబరిచింది. తమ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 5 వేల చదరపు మీటర్ల స్థలం కేటాయిస్తే 500 మందికి పైగా ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
  • St Gallen విశ్వవిద్యాలయం ప్రతినిధులైన రోజర్, అభిషేక్ రాజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. st Gallen బ్రిటిష్ ఏరో స్పేస్ కంపెనీలతో కలిసి పని చేస్తూ ఇండియాలో వారి యూనిట్లను ఏర్పాటు చేయడంలో కన్సల్టింగ్ సంస్థగా సేవలందిస్తోంది. అనేక సంస్థలతో పెట్టుబడులు పెట్టించడంలో పేరొందిన ఈ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌ను అతి పెద్ద టెక్నాలజీ టెస్టింగ్ ల్యాబ్‌గా తీర్చిదిద్దేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఏపీలో లాబ్స్ అండ్ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలు వచ్చి వారి సాంకేతికతను పరీక్షించుకునే వీలుంటుందని ప్రతినిధులు చెప్పారు.
  • స్విట్జర్లాండ్‌లో Skill devolopment కోసం పనిచేసిన రాజస్థాన్ ప్రాంతానికి చెందిన జోషి జోషి ఫౌండేషన్ స్విస్ అనుభవాలు, పద్దతులను ఇండియాకు తీసుకురావడానికి ఆసక్తి కనబరిచింది. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వానికి సహకారం అందిస్తున్న జోషి ఫౌండేషన్ ఏపీలో వినూత్న విధానాలు పరిచయం చేయాలని తనను కలిసిన ఆ సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి పని చేయాల్సిందిగా సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read