aadhar 05012017

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం కోసం ప్రవేశపెట్టిన "డా. ఎన్.టి.ఆర్.వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం" తో పాటుగా ఆ మూడు పథకాలలో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టారు.

ఆరోగ్య రక్ష పథకం ద్వారా సంవత్సరానికి మీ కుటుంబములోని పిల్లల నుండి పెద్దల వరకు ఒకొక్కరికి కేవలం రూ.1200/-మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకొని హిల్త్ కార్డును పొందవచ్చు. హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు. ముందుగా పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోగలరు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

ఆన్లైన్ విధానం
ముందుగా ఇక్కడ మీ ఆధార నెంబర్ టైపు చేస్తే, మీ ఆధర్ కు అనుసంధానం అయిన ఫోన్ నెంబర్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది.
http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx

తరువాత ఫారం ఫిల్ చేసి, ఆన్లైన్ లోనే ప్రీమియం చెల్లించవచ్చు.

ఈ క్రింది ప్రాసెస్ చూడండి

aadhar 05012017 1

aadhar 05012017 2

aadhar 05012017 3

aadhar 05012017 4

aadhar 05012017 5

అలాగే, మీకు ఇంటర్నెట్ లేకపోతే, మీ దగ్గరలో ఉన్న"మీ-సేవ" కార్యాలయాలను సంప్రదించవచ్చు.

  • దరఖాస్తు సమయములో ఎటువంటి సందేహాలకైనను టోల్ ఫ్రీ నెం. 104 లేదా 8333817469 నెంబరుకు సంప్రదించి నివృత్తిచేసుకోవచ్చు.
  • 01-01-2017 నుండి 28-02-2017 లోపు దరఖాస్తు చేసుకొని ప్రీమియం చెల్లించాలి.
  • ఆరోగ్యరక్ష పథకం ద్వారా 07-04-2017 నుండి డా.ఎన్.టి.ఆర్ వైద్యసేవలో అనుమతి పొంది ఉన్న ఆసుపత్రులలో 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్ వార్డ్ (ఎ.సి) లో వైద్యము అందించబడును.
  • హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు
  • వైద్యము పొందుతున్న సమయములో ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేకుండా డాక్టరును సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యముతో పాటు భోజనము మరియు డిశార్డ్ అయ్యేటప్పుడు 11 రోజులపాటు సరిపడా మందులను పొందగలరు.
  • డిశార్డ్ అయిన అనంతరము నిర్ధారించబడిన 138 రకాల వ్యాధులకు సంవత్సరం పాటు ఉచితంగా మందులు ఇవ్వబడును.
  • బీమా గడువు మధ్యలో పుట్టిన పిల్లలను చేర్గాలంటే పథకంలో చేరే నెల నుండి భీమా గడువు ముగిసే చివరి నెలవరకు నెలకు రూ.100/- ల చొప్పున మొత్తము చెల్లించవలసి ఉంటుంది, ఇందుకు తొలిగా పిల్లల పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది.
  • మీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 410 నెట్వర్క్(ప్రభుత్వ మరియు ప్రైవేట్)ఆసుపత్రులలో వైద్య చికిత్సలు చేయించుకోవచ్చు, ఈ ఆసుపత్రుల్లో పొందిన వైద్యచికిత్సలకు సంబంధించి మెడికల్ టీమ్ ఆడిట్(Accountable) చేస్తుంది, దీని వల్ల మీకు సరిఅయిన వైద్యం అందిందో లేదో నిర్ధారించటంతో పాటు, ఒక వేళ సరైన వైద్య చికిత్సలు అందలేదని ధృవీకరింపబడితే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది
  • ఇతర జీమా పథకాలలో బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వయసుపైబడిన వారికి ఆకాశానంటేలా ప్రీమియంలు ఎక్కువ చెల్లించాల్సిఉంటుంది. ఈ ఆరోగ్యరక్ష పథకంలో అటువంటి అధిక చెల్లింపులు లేకుండా చెల్లించిన ప్రీమియంకే పెద్దలకు పిల్లలకు ఆరోగ్య భీమా క్రింద ఒకే రకమైన వైద్యం అందించబడుతుంది.
  • ఆరోగ్యరక్ష పథకం మొదటి రెండు నెలలు కడితే చాలు, మూడో నెల నుంచి ఈ పధకం వర్తిస్తుంది. కాని ప్రైవేటు హెల్త్ ఇన్సురన్సులు, 2-3 సంవత్సరాలు ప్రీమియం కడితే కాని, మీరు క్లెయిమ్ చేసుకోవటం కుదరదు.
  • ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చెల్లించే ప్రీమియం వల్ల లభించే భీమా మొత్తం వేరొకరికి కుటుంబ సభ్యునికి బదిలీ చేయబడదు. అంటే ఒక వ్యక్తికి చెల్లించిన ప్రీమియం మరొక వ్యక్తికి వర్తించదు.
Advertisements

Advertisements

Latest Articles

Most Read