english medium 030102017

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ తెలుగు మీడియంలో బోధనకు ప్రభుత్వం స్వస్తి పలికింది, ఇక పై ఇంగ్లీషు మీడియంలో మాత్రమే విద్యాబోధన చేయాలని నిర్ణయించింది. అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ తెలుగు మీడియం బదులుగా ఇంగ్లీషు మీడియంలో తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. అయితే పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. మున్సిపల్ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం తరగతులను ప్రభుత్వం ప్రారంభించింది. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన పౌండేషన్ కోర్సు మరింత విజ్ఞానాన్నిపెంపొందించడమే కాకుండా దేశ, రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందకు ఉపకరించింది. ఈ కోర్చుకు విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ కోర్చును మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థులందరికీ తప్పనిసరి చేశారు.

విద్యార్థి తన లక్ష్యాలను చేరు కునేందుకు బోధనా మాధ్యమం కీలకపాత్ర వహిస్తుందనే అభిప్రాయాన్ని ఉత్తర్వుల్లో వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం పై తెలుగు భాషాభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read